హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టపాకాయ నిప్పురవ్వ పడి గుడిసె దగ్ధం: మహిళ మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Woman killed as paper lantern sets hut on fire
హైదరాబాద్: గుడిసె అంటుకొని 55 ఏళ్ల మహిళ మృతి చెందిన సంఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో చోటు చేసుకుంది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. దీపావళి టపాసులు పేల్చుతుండగా నిప్పు రవ్వలు పడి గుడిసె అంటుకుంది. దీంతో నిద్రిస్తున్న నాగమణి అనే మహిళ మృతి చెందింది.

ఎర్రమంజిల్ కాలనీలోని రామకృష్ణా నగర్‌లో సంగమేశ్వర్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయన సతీమణి నాగమణి. ఈమె తన భర్త, కుమారుడు మురళీ మోహన్‌, కోడలుతో కలిసి నివసిస్తున్నారు. భర్త సంగమేశ్వర్ పని మీద బాచుపల్లి వెళ్లగా, కొడుకు దీపావళి పండుగ కోసం అత్తవారింటికి వెళ్లారు. దీంతో శనివారం రాత్రి గుడిసలో నాగమణి ఒక్కరే ఉన్నారు.

శనివారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తూ నిప్పు రవ్వలు వచ్చి గుడిసె పైన పడినట్లుగా భావిస్తున్నారు. గుడిసె మంటల్లో చిక్కుకోవడంతో నాగమణి మృతి చెందారు. స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. కొడుకు మురళీ మోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరోవైపు టపాసులు కాల్చుతుండగా మెహదీపట్నం ప్రాంతంలో పద్దెనిమిది మంది పిల్లలు గాయపడ్డారు. వారికి చికిత్స చేశారు. ఓ చిన్నారి కంటిగా గాయం కావడంతో అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

English summary
A middle aged woman was charred to death after a firecracker fell on the thatched roof of her hut gutting it completely in Erramanzil here in early hours on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X