పేరెంట్స్ కోసం ప్రేమకు బై! మహిళ కోరిక తీర్చలేదని...

గుంటూరు: గిద్దలూరు మండలానికి చెందిన బాషా విశాఖపట్నంలో బీటెక్ చదువుతున్నాడు. అక్కడ ఎంటెక్ చదువుతున్న యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇంతలో ఆ యువతికి వేరే వ్యక్తితో పెద్దలు వివాహం కుదిర్చారు. పెళ్లి ఇష్టం లేక ఆమె బాషాతో కలిసి గిద్దలూరు వచ్చింది.

ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో యువతి తల్లిదండ్రులు వచ్చి కుమార్తెకు చదువు మధ్యలో ఆగిపోతుందని నచ్చ చెప్పి తీసుకు వెళ్లారు.

కోరిక తీర్చలేదని...

woman leaves lover for parents

ప్రేమించి పెళ్లి చేసుకొని, ఆనందంతో భర్తతో కాపురం చేసుకుంటూ అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న ఓ మహిళ పైన ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తనతో అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. భర్త సంపాదన చాలక ఆమె కూడా పనికి వెళ్తోంది.

ఈ నేపథ్యంలో కోరిక నెరవేర్చమని ఏడాదిగా ఇంటి వద్ద, పని చేసే వద్ద వివిధ రూపాల్లో ఓ వ్యక్తి వేధిస్తూనే ఉన్నాడు. నెల క్రితం భర్తకు చెప్పింది. పెద్దల సమక్షంలో ఆ కామాంధుడికి బుద్ది చెప్పించారు. దీంతో అతను ఆమెను అంతమొందించాలనుకున్నాడు. ఆదివారం ఉదయం ఫిరంగిపురం మండలం మునగపాడులో ఇది జరిగింది.

ఫిరంగిపురం మండలం వేములపాడుకు చెందిన యువతి అట్టల కంపెనీలో పని చేస్తుండేది. ఏడేళ్ల క్రితం అదే కంపెనీలో పని చేస్తున్న మునగపాడుకు చెందిన రఫీ అనే యువకుడిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి మునగపాడులోనే కాపురం చేసుకుంటుంది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.

గ్రామ సమీపంలోని ఓ స్పిన్నింగ్‌ మిల్లులో భర్తతో పాటు పనికి వెళుతుంది. ఇది ఇలా ఉంటే ఏడాదిగా ఊరులో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేసే షఫీ అనే యువకుడు తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఆమెను వేధిస్తున్నాడు. ఇంటి వద్ద, పని చేసే స్పిన్నింగ్‌ మిల్లులు వద్ద కూడా వేధింపులు ఎక్కువ కావడంతో నెల రోజుల క్రితం భర్తకు చెప్పింది.

భర్త తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో పెద్దల చేత షఫీని మందలింప చేశారు. దీంతో వివాదం అక్కడితో సర్థుమణిగిందనుకున్నారు. కానీ షఫీ ఆగ్రహంతో ఆమెను అంతమోందించాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం తెల్లవారు జామున రజియా బహిర్బూమికి వెళ్లే సమయంలో మాటు వేసి కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో రజియా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆమెను జీజీహెచ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+