లేడీ లెక్చరర్ ఆత్మహత్య: భార్యను చంపి ఆత్మహత్య

ఆమె భర్త సికిందరాబాద్ రైల్ నిలయంలో అసిస్టెంట్ ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. సునీతారెడ్డి పుట్టింటి వారు సైదాబాద్ కరన్‌బాగ్‌లో నిర్మించి ఇచ్చిన ఇంటిలో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం సునితారెడ్డి తన కుమార్తె ఎనిమిదవ తరగతి చదువుతున్న ప్రనీషను లేపి కోచింగ్ సెంటర్‌కు పంపింది. కొద్ది సేపటి తరువాత ఇంటికి వచ్చిన పనిమనిషికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న సునిత మృతదేహం కనిపించింది. ఆమె వెంటనే బెడ్ రూంలో నిద్రిస్తున్న ప్రవీణ్‌రెడ్డిని నిద్రలేపి సమాచారమిచ్చింది.
సంఘటనా స్థలికి చేరుకున్న సైదాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అక్కడ లభించిన సూసైడ్ నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని, వ్యక్తిగత కారణాలవల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాసినట్లు సమాచారం. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. వ్యవసాయ కూలీగా పనిచేసే బి. నర్సింహ (30) అనే వ్యక్తి తన భార్య యాదమ్మ (28)ను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
దంపతులు తరుచుగా చిన్న చిన్న విషయాలపై గొడవ పడుతూ ఉండేవారని, గురువారం రాత్రి కూడా అలాగే గొడవ పడ్డారని, గొడవలో నర్సింహ గట్టి ఆయుధంతో యాదమ్మ తలపై కొట్టాడని, దాంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆ తర్వాత మరణించిందని దోమ పోలీసులు చెప్పారు. భార్యను హత్య చేసిన తర్వాత నర్సింహ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications