భర్తపై పోలీసులకు లేడీ ఎమ్మెల్యే ఫిర్యాదు: భర్తను చంపి భార్య పరారీ
విశాఖ/ కర్నూలు/ చిత్తూరు: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత తన భర్త శివయ్యపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తను ఇంట్లో లేనప్పుడు వచ్చి పిల్లలపై దౌర్జన్యం చేశాడని , గన్‌మెన్ పీఏ లను బెదిరించాడని ఫోన్లో పాయకరావుపేట త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తాను తన భర్త శివయ్యను 14 ఏళ్ల పాటు భరించానని, సహనం నశించిందని ఎమ్మెల్యే అనిత ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రేమించిన శివయ్యను 14 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే అనిత ఇదే పోలీస్ స్టేష్‌న్లో పెళ్లి చేసుకున్నారు. ఇంట్లోని విలువైన పత్రాలను తీసుకుని వెళ్లాడని ఆమె ఫిర్యాదు చేశారు.
ఇరువురి మధ్య మనస్పర్థల కారణంగా కొన్నాళ్ల నుంచి అనిత, శివయ్య విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్యే అనిత, శివయ్యకు విడాకుల నోటీసులు పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన శివయ్య, ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బలవంతంగా పిల్లలను, ఆస్తి పత్రాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శివయ్యను అడ్డుకున్న ఎమ్మెల్యే పీఎ, గన్‌మెన్‌లపై తిరగబడ్డాడు. దీంతో అనిత పోలీసులను ఆశ్రియించారు.
ఇదిలావుంటే, కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో దారుణ సంఘటన జరిగింది. కుటుంబ కలహాలతో భర్తను భార్య దారుణంగా చంపి, అనంతరం ఆమె పరారైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

భార్యను చంపిన భర్త
కాగా, చిత్తూరు జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తిలోని అల్లూరుమ్మ (28) అదే ప్రాంతానికి చెందిన అంక్యయను రెండేళ్ల క్రితం వివాహం చేసుకుంది.
అయితే, వారిద్దరు తరుచుగా గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో శనివారంనాడు భార్యతో వాగ్వివాదానికి దిగిన అంకయ్య ఆమెను కత్తితో పొడిచాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications