కలకలం: గుంటూరులో మహిళ హత్యకు కుట్ర, అసలేం జరిగింది?

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: ఒక మహిళ హత్యకు కుట్ర పన్నిన వ్యవహారం గుంటూరులో కలకలం రేపింది. చలసాని ఝాన్సీ అనే మహిళను హత్య చేయడానికి శంకర్‌రెడ్డి అనే వ్యక్తి కుట్ర పన్నాడు. ఇందుకోసం మొదుగుల విజయ్‌భాస్కర్‌రెడ్డిని పురమాయించాడు.

ఒక పిస్టల్‌, బైక్‌ను సమకూర్చి ఝాన్సీని చంపాలంటూ శంకర్‌రెడ్డి సూచించాడు. 'ఝాన్సీని చంపకపోతే.. నిన్ను హతమారుస్తా'నని మొదుగుల విజయ్‌భాస్కర్‌రెడ్డిని శంకర్‌రెడ్డి బెదిరించినట్టు తెలుస్తోంది.

murder-conspiracy

ఈ వ్యవహారంతో భయపడిన విజయ్‌భాస్కర్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుట్ర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఝాన్సీ హత్యకు కుట్ర చేశారన్న అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. రూ. 20 లక్షల అప్పు వ్యవహారంలో హత్య చేయించేందుకు కుట్ర చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A murder conspiracy is created sensation in Guntur. According to the police.. Shankar Reddy ordered Modugula Vijay Bhaskar Reddy to murder a woman named Chalasani Jhansi. Shankar Reddy arranged a Pistol and a Bike for Shankar Reddy to murder her. But with a fear Shankar Reddy came to police and told everything what happened. Thus, this murder conspiracy was revealed.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X