భర్త హత్య: ప్రియుడితో పాటు మహిళకు జీవితఖైదు

వారిద్దరితో పాటు మరో వ్యక్తికి కూడా న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. వారికి ఒక్కొక్కరికి 500 రూపాయలేసి జరిమానా కూడా విధించారు. కేసులో న్యాయమూర్తి 14 మంది సాక్షులను విచారించింది.
కరీంనగర్ జిల్లాలోని బొమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అరుణ (32) తన ప్రియుడు సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి (34) సాయంతో భర్త గడ్డం రవీందర్ రెడ్డి (35) హత్యకు కుట్ర చేసినట్లు అభియోగాలు మోపారు. అరుణ, రవీందర్ రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం - 2001 మే 18వ తేదీన కొత్తూరు గ్రామానికి వెళ్తుండగా గడ్డం రవీందర్ రెడ్డిని సింగిరెడ్డి తన మిత్రుడు క్యాతం పృథ్వీరాజ్ (20)తో కలిసి గొడ్డలితో నరికి చంపి శవాన్ని పొదల్లో పడేశాడు. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ అరుణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications