వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడి మత్తులో కుమారుడికి వాతలు: బాలికపై రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కొడుకుని చంపేందుకు ఓ కన్నతల్లి సిద్ధమైంది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాదులోని నేరేడ్ మెట్ లో నివాసముంటున్న రేష్మ అనే మహిళ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే, తన అక్రమ సంబంధానికి కన్న కొడుకు అడ్డొస్తు న్నాడని భావించిన ఆమె బాలుడిని హింసించడం మొదలుపెట్టింది.

ఒళ్లంతా వాతలు పెట్టడమే కాకుండా కొడుకుని హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి పథకం వేసింది. విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు బాలుడిని రక్షించి, గాంధీ ఆస్పత్రికి తరలించారు. సికింద్రాబాదులోని ఆల్వాల్‌లో నివాసం ఉంటున్న రేష్మ, అన్వర్ పాషాలకు ఇద్దరు పిల్లలు. గత కొంత కాలంగా మహేష్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయింది.

 Woman planned to kill son in Secendurabad

కొద్ది రోజుల క్రితం ఆమె తిరిగి వచ్చి తన పిల్లలు తనకు కావాలంటూ నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని వెళ్లింది. విషయం తెలుసుకున్న తండ్రి ఆరా తీశాడు. దీంతో 50 వేల రూపాయలు ఇస్తేనే బాబును ఇస్తానంటూ చెప్పింది. దీంతో మౌలాలీ రైల్వే స్టేషన్ వద్ద రేష్మ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి బాలుడిని తీసుకుని వచ్చారు. బాలుడి ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ వాతలున్నాయి. పెదవులు కూడా చిట్లిపోయాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నల్లగొండ జిల్లాలోని తలుపుల మండలం రంగుండ్లలో ఓ బాలికపై యువకుడు అత్యాచారం చేశారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు హాల్యా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

వరంగల్ జిల్లాలోని హన్మకొండ సుబేదారికి చెందిన ఇంటర్ విద్యార్థి దివ్యశ్రీ ఆచూకీ లభ్యమైంది. హైదరాబాదులోని లంగర్ హౌస్ లో ఓ అపార్టుమెంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దివ్యశ్రీ తండ్రితో కలిసి వరంగల్ పోలీసులు లంగర్‌హౌస్‌ బయల్దేరారు. ఆమె ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉన్నట్టు సమాచారం.

English summary
A woman Reshma planned kill her son at Neredumet in Secendurabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X