వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మెగా' టెన్షన్, తుందుర్రులో బయటకు రావాలంటే భయం, చంద్రబాబుపై ఆగ్రహం

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు, పరిసర ప్రాంత గ్రామాల్లో బుధవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్వా ఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ 30 గ్రామాల ప్రజలు ఈ రోజు ఆందోళన తెలిపారు.

|
Google Oneindia TeluguNews

ఏలూరు: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు, పరిసర ప్రాంత గ్రామాల్లో బుధవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్వా ఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ 30 గ్రామాల ప్రజలు ఈ రోజు ఆందోళన తెలిపారు.

అక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం జరిగితే ఫ్యాక్టరీ నుంచి విష రసాయనాలు వచ్చి పంట కాలువలు, పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ పార్కు నిర్మాణం చేపట్టవద్దని నినాదాలు చేశారు.

<strong>రాయలేని విధంగా..: సాక్షి పత్రికను దూషించిన జేసీ ప్రభాకర్ రెడ్డి</strong>రాయలేని విధంగా..: సాక్షి పత్రికను దూషించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

తుందుర్రు గ్రామం పోలీస్ పహారాలో ఉంది. 1300 మంది పోలీసులతో భారీ భద్రతను చేపట్టారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యామానికి ప్రజా సంఘాలు, వైసిపి, సిపిఎం మద్దతు తెలిపాయి.

Woman protest in Tundurru against Mega Aqua Food Park

పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. వందలాది మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. చాలామంది ఎక్కడికి అక్కడ పరుగు తీశారు. ఎవరి ఎక్కడికి వెళ్లారో అర్థం కాని పరిస్థితి ఉందని అంటున్నారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

మహిళలను కూడా మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నర్సాపురం పోలీస్ స్టేషన్ తరలించారు. తుందుర్రులో అడుగడుగునా పోలీసులు ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

నర్సాపురం - భీమవరం మండలాల మధ్య గల తుందుర్రులో మెగా అక్వా ఫుడ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది.

<strong>'సత్య నాదెళ్లను చంద్రబాబే సీఈవో చేశారు, కానీ మైక్రోసాఫ్ట్ షాకిచ్చింది'</strong>'సత్య నాదెళ్లను చంద్రబాబే సీఈవో చేశారు, కానీ మైక్రోసాఫ్ట్ షాకిచ్చింది'

1300 మంది పోలీసులు

ప్రజల ఆందోళనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1300ల మంది పోలీసు సిబ్బందితో గ్రామం నిండిపోయింది.

ప్రధాన రహదారులపై బారీకేడ్లు, తనిఖీలతో పోలీసులు ఉదయం నుంచి ఎవర్నీ బయటి గ్రామాల నుంచి రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఏ క్షణాణ ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.

పోలీసు పహారా ఉండగానే సిపిఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు, మహిళలు పార్క్ నిర్మాణం పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు, మహిళా పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు.

అరెస్టయిన ఉద్యమకారులు సీఎం చంద్రబాబుకు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం పార్క్‌ యాజమాన్యానికి వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు.

కె బేతపూడి, జొన్నలగరువు, తుందుర్రు గ్రామాల్లో అడుగడుగున పోలీసులు మోహరించారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా దర్శనిమిస్తున్నాయి.

పోలీసులు - ఆందోళనకారుల మధ్య తోపులాట

తుందుర్రులో ఓ సమయంలో పోలీసులు - ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కింద పడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
Woman protest in Tundurru, West Godavari district against Mega Aqua Food Park on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X