స్త్రీపై రేప్, కొడుకు హత్య: తల్లిని రాళ్లతో కొట్టి చంపి...
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ గ్రామంలో దుండగులు ఓ వివాహిత మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె కుమారుడిని హతమార్చినట్లు తెలుస్తోంది.
ఓ కర్కోటకుడు స్నేహితుడితో కలిసి తన కన్నతల్లిని రాళ్లతో కొట్టి చంపాడు. హైదరాబాదులోని బోరబండ ప్రాంతంలోని వీవినగర్ వద్ద ఈ సంఘటన జరిగింది. తల్లిని చంపి ఆమె వద్ద ఉన్న 60వేల రూపాయలు తీసుకుని అతను పారిపోయినట్లు సమాచారం.
లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని...

ఫైనాన్స్ వ్యాపారి హరినాథ్ హత్య కేసులో నిందితులు వెంకటేశ్వర రావు, నాగరాజులను పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం పోలీసులు సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి పోలీసులు 9.70 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తన భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే కోపంతో వెంకటేశ్వరరావు వ్యాపారి హరినాథ్ హత్యకు కుట్ర పనిన్నట్లు తెలిపాడు. హత్య కేసు నుంచి తప్పించుకోవడం కోసమే నిందితులు కిడ్నాప్ డ్రామా ఆడారని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications