ఇష్టంలేక పెళ్లైన గంటకే నవ వధువు ఆత్మహత్యాయత్నం

Woman sets herself on fire
అనంతపురం/చిత్తూరు: పెళ్లైన గంటల్లోనే ఓ నవ వధువు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో శుక్రవారం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసిన కారణంగానే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లాలోని హిందూపురం అంబేడ్కర్ నగర్‌లో ఈ ఘటన జరిగింది.

అరుణ అనే యువతి ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతో పెళ్లైన గంట, గంటన్నరకే ఒంటిమీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఈ పెళ్లయింది. ఆ తర్వత గంటకు ఇంట్లోకి వెళ్లి నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

బోల్తా పడిన బస్సు

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఓ ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇరవై రెండు మందికి గాయాలయ్యాయి. నడుమూరు ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగం వల్లనే అదుపు తప్పి బస్సు బోల్తా పడినట్లుగా తెలుస్తోంది.

కుచ్చుటోపీ

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు రెండు కోట్ల రూపాయల మేర ఓ కెనడియన్ కుచ్చుటోపీ పెట్టాడు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+