అంతలోనే: న్యూజెర్సీలో ఇల్లు ప్లాన్ చేసిన శశికళ, 'ఆమె'తో కలిసి చంపాడేమోనని..

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: న్యూజెర్సీ నుంచి రోజూ తల్లిదండ్రులతో మాట్లాడే శశికళ గురువారం సాయంత్రం ఫోన్ చేశారు. తల్లిదండ్రులను కుశల ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయమే అల్లుడు హనుమంత రావు ఫోన్ చేసి.. శశికళ, హనీష్ సాయి మృతి చెందినట్లు చెప్పాడు.

ఒకటి రెండు మాటలు చెప్పి ఫోన్ పెట్టారని చెబుతున్నారు. ఆ తర్వాత పూర్తి వివరాలు తెలుసుకుందామంటే స్పందన లేదని చెబుతున్నారు. రెండున్నరేళ్ల క్రితమే శశికళ కుటుంబంతో కలిసి వచ్చి వెళ్లారు.

New Jersey

న్యూజెర్సీలో ఇల్లు కొనుక్కుందామనుకుంటున్నానని శశికళ చెప్పడంతో తల్లిదండ్రులు కొద్దిరోజుల క్రితం పాస్‌పోర్టులు చేయించుకున్నారు. ఇంతలోనే ఈ దారుణం జరగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

కాగా, తమ కూతురు శశికళ, మనవడు హనీష్ సాయిని అల్లుడు హనుమంత రావే చంపేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న హనుమంత రావు ప్రవర్తన రెండేళ్లుగా సరిగా లేదంటున్నారు. శశికళను తాను సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి అతనే చంపి ఉంటాడని లేదంటే కిరాయి హంతకులతో చంపించి ఉంటాడని అనుమానిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 40-year-old woman techie from Andhra Pradesh and her seven-year-old son living in New Jersey were murdered at home on Thursday, according to information received by the family members in Prakasam district.
Please Wait while comments are loading...