అదృష్టం తలుపు తట్టింది: పొలం పనికెళ్తే 15 లక్షల వజ్రం దొరికింది
అమరావతి: రోజూ వారి పనుల్లో భాగంగా ఓ మహిళ పొలానికి వెళ్లింది. పొలంలో పని చేసుకుంటుండగా ఆమెకు విలువైన వజ్రం దొరికినట్లు సమాచారం. ఈ సంఘనట అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలం ములకలపెంట గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ వజ్రాన్ని ఆ మహిళ కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తికి దాన్ని రూ.15 లక్షలు, 10 తులాల బంగారానికి గాను విక్రయించినట్లు తెలిసింది.

రాయలసీమలో హైకోర్టు: మాజీ మంత్రి శైలజానాథ్
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్ చేశారు. గుంటూరులో రాజధాని ప్రాంతం నిర్మించే చోట వరదలు, భూకంపాలు వస్తాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారని అన్నారు. గుంటూరులో రాజధాని ఏర్పాటు చేసి, రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications