హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు గ్రామాల మధ్య చిచ్చు: మగశిశువును బావిలో పడేసిన మహిళలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని గండీడ్ మండలం రంగారెడ్డిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. నెలరోజుల మగ శిశువును ఇద్దరు మహిళలు బావిలో పడేశారు. శిశువును కాపాడిన గ్రామస్తులు మహిళలకు దేహశుద్ధి చేశారు.

రెండు కుటుంబాలు, గ్రామాల మధ్య ఉన్న కక్షనే ఇందుకు కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మగపిల్లవాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కమ్మల చోరీ

ఇదిలావుంటే, హైదరాబాద్ నగరంలోని ఫతేనగర్ గౌతమ్‌నగర్‌లో బాలిక అపహరణ యత్నం జరిగింది. ఏడో తరగతి బాలిక సోనాలికి మాయమాటలు చెప్పి మహిళలు తీసుకెళ్లారు. బాలిక చెవికమ్మలు తీస్తుండగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికులు రావడం చూసిన మహిళలు బాలికను వదిలి పరారయ్యారు.

ఫిర్యాదు చేసుకుందు బాలిక తల్లిదండ్రులు బాలనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా... ఆ ప్రాంతం తమ పోలీస్‌ స్టేషన్ పరిధిలోకి రాదని సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సనత్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Women have thrown a boy into a well in Rangareddy district.

దొంగల పట్టివేత

కరీంనగర్‌లో ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.6.27 లక్షల విలువైన బంగారం, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు తరలించారు.

హయత్‌నగర్‌లోనూ..

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో పోలీసులు ఏడుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 11 ద్విచక్రవాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. 7.5 తులాల బంగారం, 2 ల్యాప్‌టాప్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపర్చడానికి తరలించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో...

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారం స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

English summary
Women have thrown a boy into a well in Rangareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X