వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీలవీడియోపై గవర్నర్ కు మహిళా జేఏసీ ఫిర్యాదు, విడిచిపెట్టని టీడీపీ!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు వదిలిపెట్టడం లేదు. ఒకపక్క ఆ వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. ఒరిజినల్ వీడియో దొరికితేనే అసలు విషయం బయట పడుతుందని వెల్లడించారు. అయితే మొదట ఐ టిడిపి వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో షేర్ అయిందని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో ఈ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపలేదని టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ను ఈ వ్యవహారం నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

గోరంట్ల మాధవ్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన మహిళా జేఏసీ నేతలు

గోరంట్ల మాధవ్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన మహిళా జేఏసీ నేతలు

ఈ క్రమంలోనే తాజాగా గోరంట్ల మాధవ్ వ్యవహారంపై టిడిపి మహిళా నేతలతోపాటు, వైసీపీ మినహా అఖిలపక్ష మహిళా జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్ ను విజ్ఞప్తి చేశారు.

గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన జేఏసీ ఈ వీడియోను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షించాలని, సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ వ్యవహారం మహిళలను అవమాన పరిచేలా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని వారి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.

లోక్ సభ స్పీకర్ కు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా ఫిర్యాదు చేస్తామన్న అనిత

లోక్ సభ స్పీకర్ కు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా ఫిర్యాదు చేస్తామన్న అనిత

ఇక వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం టిడిపి మహిళా నేత వంగలపూడి అనిత, గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించామని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని గవర్నర్ ను కోరామని ఆమె పేర్కొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై గవర్నర్ బాధపడ్డారని వంగలపూడి అనిత వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలి పెట్టబోమని, త్వరలో మహిళా జేఏసీ తరఫున ఢిల్లీ వెళ్తామని, అక్కడ లోక్సభ స్పీకర్ కు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని వంగలపూడి అనిత తెలిపారు.
గోరంట్ల మాధవ్ ను బర్తరఫ్ చేసేదాకా పోరాటం చేస్తామన్న అనిత

గోరంట్ల మాధవ్ ను బర్తరఫ్ చేసేదాకా పోరాటం చేస్తామన్న అనిత


ఎంపీ గోరంట్ల మాధవ్ ను బర్తరఫ్ చేసేవరకూ తాము పోరాటం కొనసాగిస్తామని వంగలపూడి అనిత వెల్లడించారు. ఇక ఇదే సమయంలో తప్పు చేసింది కాకుండా ఎంపీ మాధవ్ కెమెరా ముందు కూర్చొని చాలెంజ్ విసురుతున్నాడు అని వంగలపూడి అనిత మండిపడ్డారు. ఎంపీ మాధవ్ మీడియా వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి నిమ్మకు నీరెత్తినట్లు ఉందని వంగలపూడి అనిత అసహనం వ్యక్తం చేశారు. శాటిలైట్ టెక్నాలజీ ద్వారా క్రిమినల్స్ ను పట్టుకోవడంలో సిద్ధహస్తుడైన ఎస్పీ ఫకీరప్ప ఒరిజినల్ వీడియో ఉంటేనే తప్ప ఏం చేయలేం అని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది అంటూ వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.

గోరంట్ల మాధవ్ వ్యవహారం... టీడీపీ ఎక్కడివరకు వెళ్తుందో?

గోరంట్ల మాధవ్ వ్యవహారం... టీడీపీ ఎక్కడివరకు వెళ్తుందో?

ఒరిజినల్ వీడియో సాకు చూపి డర్టీ ఎంపీని కేసు నుంచి తప్పించాలని చూడటం చూస్తుంటే, ఎస్పీ ఫకీరప్ప ప్రభుత్వ పెద్దల చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడని అనుమానం వస్తుందని వంగలపూడి అనిత పేర్కొన్నారు. మొత్తానికి ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టకుండా కొనసాగిస్తూనే ఉంది. మరి ఈ వ్యవహారంలో టిడిపి ఎక్కడి వరకు వెళుతుంది అనేది తెలియాల్సి ఉంది.

English summary
Women have complained to the Governor about MP Gorantla Madhav's nude video. They appealed to the governor to send the video to the central forensic lab and take up the investigation of the case suomoto. tdp also targeting gorantla madhav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X