మహిళా జర్నలిస్టుల అరెస్టు, గవర్నర్‌కి ఫిర్యాదు

హైదరాబాద్: ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానెళ్ల ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు క్యాంప్ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా జర్నలిస్టులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై బైఠాయించిన మహిళా జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.

మహిళా జర్నలిస్టుల్లో ఇద్దరు గర్భవతులున్నారని, పోలీసులు ఇవేమి పట్టించుకోకుండా అత్యంత దారుణంగా వ్యవహరించారని మహిళా జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. మహిళా జర్నలిస్టులను అరెస్టు చేస్తున్న సమయంలో, లైవ్ కవరేజ్ చేస్తున్న మీడియాపై పోలీసులు జులుం ప్రదర్శించినట్లు ఆరోపిస్తున్నారు.

తమ పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై గవర్నర్‌కి ఫిర్యాదు చేసేందుకు మహిళా జర్నలిస్టులు సిద్దమయ్యారు. మహిళా జర్నలిస్టులకు గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ లభించింది. మరికాసేపట్లో వీరంతా గవర్నర్‌ను కలవనున్నారు.

ఏబీఎన్‌, టీవీ 9 ప్రసారాల నిలిపివేతపై జర్నలిస్టుల ధర్నా

women journalist arrested at kcr camp office

తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాల నిలిపివేతకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం పలువురు జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. మీడియాను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేయడం కుట్ర పూరితమైందని అన్నారు.

డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు, కలెక్టర్ నీతూ ప్రసాద్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలు జర్నలిస్ట్‌ సంఘాల నేతలతో పాటు, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు, టీవీ9 ప్రతినిధులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+