చానెళ్ల బ్యాన్: గవర్నర్‌కు లేడీ జర్నలిస్టులు ఫిర్యాదు

గవర్నర్‌తో భేటీ తర్వాత ఏబీఎన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌కు అన్ని విషయాలు వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించారని, మంగళవారం ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ టీవీలో చూస్తున్నానని ఆయన చెప్పారని వారన్నారు.
చానెళ్ల పునరుద్ధరణపై నరసింహన్ చర్యలు తీసుకుంటానే భావిస్తున్నట్లు ఏబీఎన్ ప్రతినిధి సుధా తెలిపారు. గవర్నర్ తీసుకునే చర్యల గురించి ఎవరూ చెప్పనవసరం లేదని గవర్నర్ చెప్పారని అన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మరో ఏబీఎన్ ప్రతినిధి మధురవాణి ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రసారాలు పునరుద్ధరించాలని కోర్టు తీర్పు ఇచ్చినా ఎంఎస్‌ఓలు లెక్కచేయలేదని, చట్టాన్ని కూడా వాళ్లు గౌరవించడంలేదని, ఈ విషయలన్నీ గమనిస్తున్నానని గవర్నర్ చెప్పారని టీవీ-9 ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వం గానీ, గవర్నర్ గానీ చర్యలు తీసుకుంటేగానీ సమస్య పరిష్కారం కాదని టీవీ-9 ప్రతినిధి అన్నారు.












Click it and Unblock the Notifications