మహిళలకు మాత్రమే-తాడిపత్రిలో జేసీ న్యూఇయర్ పార్టీ-బీజేపీ యామిని ఫైర్..!
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్దమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర వేడుకలు విభిన్న రూపాల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈసారి న్యూఇయర్ పార్టీని విభిన్నంగా నిర్వహిస్తున్నారు. కేవలం మహిళలకు మాత్రమే ఈ పార్టీలో అనుమతించేలా దీన్ని ప్లాన్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సౌజన్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్టీలో కేవలం మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.
దీనిపై బీజేపీ మహిళా నేత సాదినేని యామినీ శర్మ పైర్ అయ్యారు. తాడిపత్రిలో ఇలా మహిళల కోసమే న్యూఇయర్ పార్టీ ఎలా పెడతారని ఆమె ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇలా మహిళల కోసమే ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకూ డిస్కోలతో పార్టీ ఏర్పాటు చేసారని యామిని ఆరోపించారు. దీనిపై వీడియోలు వైరల్ అవుతున్నాయని ఆమె తెలిపారు. మన సంస్కృతికి భిన్నంగా, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఈ పార్టీ ఏర్పాటు చేసారన్నారు.

ఈ మహిళల పార్టీ ఏర్పాటును ప్రశ్నితే జేసీ కుటుంబీకులు బెదిరిస్తున్నారని సాదినేని యామిని ఆరోపించారు. ఎంజాయ్ చేయమని అడుగుతున్నారంటే, పెళ్లి కాని ఆడపిల్లల మాన ప్రాణాలు, పెళ్లైన ఆడవారి కుటుంబాల్లో చిచ్చుపెట్టేందుకే దీన్ని ఏర్పాటు చేస్తున్నారా అని ప్రశ్నించారు. మహిళా సమాజం తమ కోసం ఇలాంటి పార్టీ పెట్టమని అడిగిందా అని యామిని ప్రశ్నించారు. పార్టీలో చేసుకునే వారంతా మద్యం మత్తులో తిరుగుతుంటారని, అలాంటి సమయలో ఆడవారిని మాత్రమే పిలిచి పార్టీలు పెడితే వారి మాన ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారని నిలదీశారు.
న్యూ ఇయర్ పార్టీ ఒక విష సంస్కృతి - సాధినేని యామినీశర్మ#SadineniYaminiSharma #YaminiSharma #APBJP #NewYear2025 #AndhraPradesh pic.twitter.com/cWHaEF5SIh
— oneindiatelugu (@oneindiatelugu) December 31, 2024
ఇది అసలు మన కొత్త సంవత్సరమే కాదని, ఇలాంటి పార్టీలు పెట్టి కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని యామిని ఆరోపించారు. ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచించాలన్నారు. మహిళలు కూడా ఇలాంటి పార్టీలపై ఆలోచించాలని ఆమె కోరారు. ఇది ఓ విష సంస్కృతికి తెరదీసే ప్రమాదం ఉందన్నారు. అంతగా పార్టీలు చేసుకోవాలనుకుంటే ఇంట్లో చేసుకోవాలని సూచించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications