మహిళా దినోత్సవం: బాబు శుభాకాంక్షలు, పురుషులు మారాలన్న రోజా

హైదరాబాద్: రెండు రాష్ట్రాలు తెలుగు మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కేక్‌ కట్‌ చేసిని చంద్రబాబు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల అభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సభాపతి కోడెల శివప్రసాద రావు, మంత్రులు నారాయణ, మృణాళిని, పీతల సుజాత, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, గాయని సునీత తదితరులు పాల్గొన్నారు.

Women's Day: MLA Roja says men need to be changed

చట్టాలు ఎన్ని ఉన్నా ఉపయోగం లేదని, పురుషుల ఆలోచన విధానంలోనే మార్పు రావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె పలువురు మహిళలను సత్కరించారు.

తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అన్ని రంగాల్లో పురుషులకు ఏమాత్రం తగ్గకుండా మహిళలు రాణిస్తున్నా, ఇంకా వివక్ష చూపిస్తున్నారని అన్నారు. మహిళా సాధికారత అనేది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైందని, అది ఆచరణలోకి రావాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+