హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాంతాలు గాయబ్: టెక్కీ రేప్‌పై ఆగ్రహం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు రెండుగా విడిపోయి నిరసన ప్రదర్శనలతో సచివాలయంలో కొంత కాలం వాతావరణం వేడెక్కింది. కానీ, ఇప్పుడు వారంతా ఒక్కటయ్యారు. హైటెక్ సిటీలో మహిళా స్టాఫ్‌వేర్ ఇంజనీర్‌పై జరిగిన లైంగిక దాడిని నిరసిస్తూ ప్రాంతాలకు అతీతంగా మహిళా ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు.

టెక్కీపై జరిగిన లైంగిక దాడిని ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని మహిళా ఉద్యోగులు గురువారం సచివాలయంలో నినదించారు. టెక్కీపై అత్యాచారాన్ని నిరసిస్తూ సచివాలయంలోని ఎల్ బ్లాక్ నుంచి సి బ్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో సచివాలయ మహిలాగ ఉద్యోగుల అధ్యక్షురాలు నిర్మల, సచివాలయ తెంలగాణ ఉద్యోగినుల సంఘం ఉపాధ్యక్షురాలు నేతి మంగమ్మ, సుభద్ర, సరస్వతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

అభయకు సంఘీభావం..

అభయకు సంఘీభావం..

ప్రాంతాలవారీగా విడిపోయిన సచివాలయ ఉద్యోగులు టెక్కీపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండించే విషయంలో కలిసిపోయారు. మహిళా ఉద్యోగులు గురువారం సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు.

ఉమ్మడి సమస్య కలుపుతుంది..

ఉమ్మడి సమస్య కలుపుతుంది..

సచివాలయ మహిళా ఉద్యోగినులను తోటి మహిళపై జరిగిన దారుణం కలిపింది. టెక్కీ అభయపై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ ప్రాంతాలకు అతీతంగా మహిళలు నినాదాలు చేశారు.

తీవ్ర సంచలనం

తీవ్ర సంచలనం

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై జరిగిన లైంగిక దాడి హైదరాబాదు నగరంలోనే కాకుండా రాష్ట్రమంతా సంచలనం కలిగించింది. సచివాలయ ఉద్యోగుల ర్యాలీ దానికి సంకేతంగా నిలుస్తుంది.

భద్రత కల్పించాలి...

భద్రత కల్పించాలి...

మహిళా టెక్కీపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు తగిన భద్రత కల్పించాలని ప్రాంతాలకు అతీతంగా మహిళలు డిమాండ్ చేశారు.

English summary
Women staff in secretariat protest against sexual assault on techie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X