పోలవరం స్కామ్ లో చిక్కుకున్న వైసీపీ వీరవిధేయుడు, నోటీసులు జారీ

పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని ఎన్నో సంవత్సరాల నుండి అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఎవరు సీఎం అయినా మొదట చెప్పే మాట పోలవరం ప్రాజెక్టును మేమే పూర్తి చేస్తామని. అయితే ఏ ముహూర్తాన పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైందో కానీ దశాబ్దాలు గడుస్తున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారిపోయినా ఆ ప్రాజెక్టు మాత్రం ఇంత వరకు పూర్తి కాలేదు.

గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారని, ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను పక్కదోవ పట్టించారని జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే టీడీపీ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారానికి దూరమైన తర్వాత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టులో జరిగిని అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం విచారణ ప్రారంభించింది.

Worked as special collector of Polavaram project and issued notices to the officer

గతంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ గా పనిచేసిన మురళిపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిధులు అక్రమ మార్గాల్లో తరలించారని, ఈ విషయంపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని అప్పటి పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ మురళికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ గా పనిచేసిన మురళికి ఇప్పుడు ఇబ్బందులు ఎదురైనాయి..

పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ గా పని చేసిన మురళి అక్రమంగా చెల్లింపులు చేశారని, ఆయన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా రూ 19.52 కోట్లు నష్టం వాటిల్లిందని అభియోగాల్లో పేర్కొంది. పోలవరం ఇరిగేషన్ స్పెషల్ కలెక్టర్ గా పని చేసిన మురళికి పది రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిధులను పక్కదోవ పట్టించారని ఆ ప్రాజెక్టు పనులు సక్రమంగా నిర్వహించలేదని గత రెండుమూడు సంవత్సరాలుగా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఉన్నతస్థాయి అధికారుల విచారణకు ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+