ఆంధ్రప్రదేశ్ రాజధాని: పుత్రజయలా వరల్డ్ క్లాస్

శివరామకృష్ణన్ కమిటీ శనివారం మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని రాజధాని సలహా కమిటీతో చర్చలు జరిపింది. ఆ తర్వా శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. ఈ రెండు సమావేశాలతో ఆంధ్రపదేశ్ రాజధానిపై కచ్చితమైన నిర్ణయం వస్తుందని భావిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం మెకంజీ, ఎల్ అండ్ టీ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాయి. రాజధాని కోసం మలేషియా, సింగపూర్‌లను సందర్శించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.
కాగా రాజధానికి కావలసిన భూమి కోసం విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలిలో భూ సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 184 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ రింగు రోడ్డు పరిధిలోనే 30వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తోంది.
రాజధాని నిర్మాణం కోసం వాటాల పద్ధతిలో భూమిని సేకరిస్తారు. రైతులు నిర్ణయించిన చోటే రాజధానిని నిర్మించాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. రాజధానికి 30వేల ఎకరాల భూమి కావాల్సి ఉండగా, మలేషియా పుత్రజయలా రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటోంది. అందుకే, పుత్రజయను సందర్శించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.












Click it and Unblock the Notifications