జగన్ పార్టీ రెబెల్ ఎంపీ గీతపై హైకోర్టులో పిటిషన్

అరకు (ఎస్టీ) స్థానం నుంచి ఎన్నికైన కొత్తపల్లి గీత అధికారులను తప్పుదోవ పట్టించి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం పొందారని ఆరోపించారు. దీనిపై రాష్ట్రపతితోపాటు ప్రధానికీ ఫిర్యాదు చేసిన ట్లు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా, అడ్డతీగల మండలం, తిమ్మాపురంలో పుట్టిన ఆమె, ‘బీసీ-సి' సామాజికవర్గంలోని ‘ఆది ఆంధ్ర క్రిస్టియన్' అని వివరించారు.
ఈ మేరకు ఆమె పాఠశాల రికార్డులలోనూ నమోదై ఉందని, క్షేత్రస్థాయి విచారణ తర్వాత ఆ జిల్లా జేసీ కూడా ఈ మేరకు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆమె కుటుంబసభ్యులలో కొందరి జనన, మరణ రికార్డుల్లోనూ ‘మాల, క్రిస్టియన్' అని నమోదైన ఉందన్నారు. అసలు పేరు ‘కొత్తపల్లి గ్లాడీస్ జాకబ్' కాగా, ‘కొత్తపల్లి గీత'గా మార్చుకున్నారని పేర్కొన్నారు. అయితే, జేసీ నివేదికను ఆమె హైకోర్టులో సవాలు చేసి, స్టే ఆదేశాలు పొందగా ప్రభుత్వం అప్పీలు చేసినట్లు గుర్తుచేశారు. దీనిపై ధర్మాసనం విచారణకు ఆదేశించినా ప్రభుత్వం ఇంతవరకూ తేల్చలేదని చెప్పారు.
ఇక నిరుడు కుల, నివాస ధ్రువీకరణ కోసం గీత దరఖాస్తు చేసుకోగా తిరస్కరించిన ఎమ్మార్వో, ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆమె వాల్మీకి (ఎస్టీ) సామాజికవర్గానికి చెందినవారంటూ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు. 1993లో గీత, మరికొందరు గ్రూపు-1 పోస్టులకు ఎంపికైనపుడు పిటిషన్ దాఖలవడంతో ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ విచారణకు ఆదేశించిందన్నారు. ఆమె ఎస్టీ కాదంటూ ఎస్టీ సంక్షేమశాఖ కమిషనర్ నివేదిక ఇచ్చారన్నారు. దీన్ని 1994లో ఆమె హైకోర్టులో సవాలు చేయగా, ఈ ఏడాది జూలై 29న కొట్టివేసిందని వివరించారు. ఈ కారణాల దృష్ట్యా ఆమె ఎంపీగా కొనసాగడానికి వీల్లేదని ప్రకటించాల్సిందిగా కోరారు.












Click it and Unblock the Notifications