• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన సాధినేని యామిని ..రాజకీయ అజ్ఞాతంలో అందుకే ఉన్నానని వ్యాఖ్య

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై మాటల తూటాలు పేల్చిన తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని ప్రస్తుత రాజకీయ అజ్ఞాతంలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆమె సైలెంట్ అయ్యారు. దీంతో సాధినేని యామిని పార్టీ మారతారు అన్న ప్రచారం జోరుగా సాగింది. బీజేపీలో యామిని చేరుతున్నారని, వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు అని అందుకే టిడిపి యాక్టివిటీస్ కు యామిని దూరంగా ఉంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా దానిపైన సాదినేని యామిని స్పందించలేదు.

వైసీపీకి షాక్ ఇచ్చిన నేత .. టీడీపీలో చేరిక .. 100 రోజుల పాలనకు ఇద్దే అద్దం అన్న బాబు

 రాష్ట్రంలోని అధికార పార్టీకి కాస్త సమయం ఇవ్వాలనే సైలెంట్ అయ్యానన్న యామిని

రాష్ట్రంలోని అధికార పార్టీకి కాస్త సమయం ఇవ్వాలనే సైలెంట్ అయ్యానన్న యామిని

ఇక తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆమె తాను సైలెంట్ గా ఉండటానికి గల కారణాలను, పార్టీ మార్పు వార్తలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుండి సాధినేని యామిని సైలెంట్ అయ్యారు. తన వ్యక్తిగత కారణాల వల్లే ఆమె ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లుగా పేర్కొన్నారు యామిని. అంతేకాకుండా అటు దేశంలో బిజెపికి, ఇటు రాష్ట్రంలో వైసీపీకి అఖండమైన మెజారిటీ ఇచ్చి ప్రజలు అధికారం కట్టబెట్టారని పేర్కొన్న యామిని రాష్ట్రంలోని అధికార పార్టీకి కాస్త సమయం ఇవ్వాలని తను భావించినట్లుగా పేర్కొన్నారు. ఇంకా మూడు నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత పరిపాలన తీరును బట్టి తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని ఆమె పేర్కొన్నారు.

అజ్ఞాతం వీడాలని చంద్రబాబు కోరారు .. పార్టీ మార్పు ప్రచారంపై స్పందించాల్సిన అవసరం లేదన్న యామిని

అజ్ఞాతం వీడాలని చంద్రబాబు కోరారు .. పార్టీ మార్పు ప్రచారంపై స్పందించాల్సిన అవసరం లేదన్న యామిని

ఇక పార్టీ మార్పు ప్రచారంపై తాను స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు యామిని. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే యామిని పార్టీ మార్పు అంశం పైన చాలా డిప్లోమేటిక్ గా మాట్లాడారు. స్వయానా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అజ్ఞాతం వీడి రాజకీయాలలో యాక్టివ్ గా పని చేయాలని కోరారని, అయినప్పటికీ తన వ్యక్తిగత కారణాల వల్ల తాను ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉన్నానని చెప్పిన యామిని తాను ఏ పార్టీలో కి వెళ్తాను అన్న అంశంపై తానేమీ మాట్లాడ దలుచుకోలేదు అని వ్యాఖ్యానించారు. జరుగుతున్న ప్రతి ప్రచారానికి స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

రాజకీయాలపై ఆసక్తి లేనట్టు మాట్లాడిన టీడీపీ ఫైర్ బ్రాండ్ యామిని

రాజకీయాలపై ఆసక్తి లేనట్టు మాట్లాడిన టీడీపీ ఫైర్ బ్రాండ్ యామిని

ఇక అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాభీష్టం మేరకు పనిచేస్తానని, రాజకీయాల్లో ముందుకు నడుస్తానని సాదినేని యామిని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం టిడిపి ఉన్న పరిస్థితిలో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనే సమర్థత ఉన్న నాయకురాలిగా మాట్లాడే ఆసక్తి గానీ, టిడిపి కోసం పని చేయాలనే తపన కానీ సాధినేని యామిని మాటల్లో వ్యక్తం కాలేదు. గతంలో టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా వాగ్బాణాలు సంధించిన సమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత దారుణమైన ఆరోపణలు చేసినా ధీటుగా ఎదుర్కొన్న యామిని ఇప్పుడు వెనకడుగు వేశారు .

వేచి చూసే ధోరణిలో యామిని ... పొలిటికల్ జర్నీపై ఇంకా డైలమానే !!

వేచి చూసే ధోరణిలో యామిని ... పొలిటికల్ జర్నీపై ఇంకా డైలమానే !!

నిన్నా మొన్నటి దాకా అధికార పార్టీ గా ఉన్న టిడిపికి ఓ బలమైన వాయిస్ గా పనిచేసిన సాదినేని యామిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై విమర్శనాస్త్రాలు సంధించారు . తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇక ఈ సమయంలో ఆమె వైసీపీలో చేరాలన్నా గతంలో వైసీపీ పట్ల ఆమె వైఖరి ప్రస్తుతం ఆమెకు ప్రతిబంధకంగా మారిందేమో అన్న అభిప్రాయం లేకపోలేదు . అదే సమయంలో బిజెపిలో చేరుతున్నట్లు గా ప్రచారం జరిగినా సాధినేని యామిని వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. కొద్ది రోజుల తరువాత రాష్ట్ర రాజకీయ పరిణామాలలో ఏవైనా మార్పులు వస్తే ఆ మార్పులకు అనుగుణంగా సాధినేని యామిని తదుపరి రాజకీయ ప్రయాణం సాగించే అవకాశం కనిపిస్తోంది.

English summary
Yamini Sadineni, known as a firebrand leader of TDP has broken her political silence. Speaking to a media channel in Vijayawada, the TDP leader said she has been maintaining political silence due to her personal problems and the death of her father recently. Yamini Sadineni said she has been monitoring the functioning of the state and central governments for the last three months over the implementation of various welfare schemes. Yamini, who worked as TDP's official spokesperson said very soon she will be active in politics. Reacting to her chances of changing the party, Yamini Sadineni with a smiling face has answered the question in a logical manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more