ఇండియా కూటమిలోకి జగన్ - తప్పదిక..!!
జగన్ ఢిల్లీ ధర్నా తరువాత కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది. జగన్ కు ఢిల్లీలో కాంగ్రెస్ మినహా ఇండియా కూటమిలోని పార్టీలు మద్దతుగా నిలిచాయి. అదే సమయంలో జగన్ ఇండియా కూటమిలోకి రావాలని ఆహ్వానించాయి. జగన్ మాత్రం తన వైఖరి స్పష్టం చేయలేదు. రాజ్యసభలో జగన్ కు 11 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సమయంలోనే టీడీపీ సీనియర్ నేత యనమల ఇండియా కూటమిలోకి జగన్ చేరిక పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
ఢిల్లీలో జగన్ కు ఇండియా కూటమి పార్టీల మద్దతు ఇచ్చిన అంశాన్ని యనమల ప్రస్తావించారు. ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌కు ఢిల్లీ స్థాయిలో ఓ షెల్టర్ కావాలన్నారు యనమల. ఇదే సమయంలో ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలని కామెంట్ చేశారాయన. ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు రావడమే దీనికి సంకేతమన్నారు.
లోకేష్ క్లారిటీ ఇండియా కూటమిలో జగన్ చేరడం అనివార్యమని చెప్పుకొచ్చారు.

ఇప్పటి వరకు జగన్ బీజేపీతో షెల్టర్ పొందారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీడీపీ, జనసేన ఎన్డీఏలో చేరటంతో బీజేపీ కూటమిలోకి జగన్ రాలేని పరిస్థితి ఏర్పిడిందన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ.. కూటమి పార్టీగా జగన్ ఇండియాలో భాగస్వామి కాబోతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యనమల. అదే సమయంలో మరో ఆసక్తి కర సన్నివేశం చోటు చేసుకుంది. కాగా, అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జగన్‌కు ఇండియా కూటమిలో చేరేంత ధైర్యం ఉందా అంటూ యనమలను ప్రశ్నించారు. జగన్ అంత సాహసం చేస్తారని తాను అనుకోవడంలేని విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications