సోనియాతో ఒప్పందం నిజం కాదా: జగన్‌పై యనమల

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో వైయస్ జగన్మోహన్ రెడ్డి రహస్య ఒప్పందం నిజం కాదా? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ నిర్ధారించిన రూ. 43వేల కోట్లను ఎక్కడ దాచారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రజలకు సంతోషాన్ని దూరం చేసింది: బాబు
కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్ర ప్రజలతోపాటు దేశ ప్రజలు కూడా సంతోషానికి దూరమయ్యారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన సోమవారం హోలీ పండగ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కలలు సాకారమైనప్పుడే నిజమైన హోలీ పండగ అని అన్నారు. తన నివాసంలో గిరిజనులు, లంబాడీలతో కలిసి చంద్రబాబు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా హోలీ జరుపుకోలేకపోయారన్న ఆయన.. ఈసారి ఆ పాలన అంతమవుతున్నందున సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు తీరాలంటే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు.












Click it and Unblock the Notifications