ఏపీకి భవిష్యత్‌లో బిజెపితో ఇబ్బందులు: యనమల
అమరావతి:రానున్న రోజుల్లో ఏపీ రాష్ట్రానికి మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. అయితే అన్నింటికీ కూడ తాము సిద్దమయ్యామని యనమల రామకృష్ణుడు చెప్పారు.
పార్లమెంట్‌లో విభజన సమయంలో నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం కన్పిస్తున్నాయని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అమరావతిలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం నాడు మీడియాతో చిట్ చాట్ చేశారు .

రాజ్యసభలో బిజెపికి పూర్తిస్థాయి మెజారిటీ లేనందున కొంత ఆ పార్టీ కొంత తగ్గి ప్రవర్తిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో కూడ మెజారిటీ ఉంటే ఆ పార్టీ ఎలా ప్రవర్తించేదో అని యనమల రామకృష్ణుడు అనుమానాన్ని వ్యక్తం చేశారు.
దశాబ్దాల తర్వాత ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీ దూరమైందని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కానీ, ప్రజల నుండి దూరమయ్యేందుకు బిజెపికి నాలుగేళ్ళే పట్టిందని యనమల రామకృష్ణుడు చెప్పారు.












Click it and Unblock the Notifications