• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జ‌ంప్ జిలానీల్లో టిక్కెట్లు ద‌క్కేది ఎంద‌రికి :వైసిపి ఫిరాయింపు దార్ల‌లో కొత్త టెన్ష‌న్..!

|

వైసిసి నుండి ఎమ్మెల్యేలుగా గెలిచారు. కొంత కాలం ప్రతిప‌క్ష ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ త‌రువాత అధికార పార్టీలోకి పిరాయించారు. న‌లుగురు మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. మ‌రి..వీరంద‌రికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ల‌భిస్తాయా. టిడిపి అధినాయ‌క‌త్వం ఆలోచ‌న ఏంటి. ఎంద‌రికి టిక్కెట్లు ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి మిగిలిన వారి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంటి..వారి అడుగులు ఎటు..

వైసిపి కి మరింత సినీ గ్లామ‌ర్‌: ఘ‌ట్ట‌మ‌నేని వెర్స‌స్ అక్కినేని : రాజ‌ధాని కేంద్రంగా..!

జ‌గ‌న్ ల‌క్ష్యంగా ఫిరాయింపులు..

జ‌గ‌న్ ల‌క్ష్యంగా ఫిరాయింపులు..

2014 ఎన్నిక‌ల్లో వైసిపి నుండి 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఆ త‌రువాత 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిం చి..టిడిపి లో చేరారు. వారిలో నంధ్యాల నుండి గెలిచిన భూమా నాగిరెడ్డి మ‌ర‌ణించారు. దీంతో..అక్క‌డ ఉప ఎన్నిక జ‌రి గింది. ఆ ఉప ఎన్నిక లో టిడిపి అభ్య‌ర్ధి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి గెలుపొందారు. అప్ప‌టికే పార్టీ ఫిరాయించిన వైసిపి ఎమ్మె ల్యేల్లో న‌లుగురు మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ‌, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ రంగారావు, ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే అమ‌ర‌నాధ‌రెడ్డికి టిడిపి అధినేత మంత్రి ప‌ద వులు క‌ట్ట‌బెట్టారు. ఆ త‌రువాత ఈ వ్య‌వ‌హార పై వైసిపి కోర్టును ఆశ్ర‌యించింది. కోర్టు సైతం వీరికి నోటీసులు జారీ చేసింది. వీరిపై అన‌ర్హ‌త వేటు వేసే వ‌ర‌కూ శాస‌న‌స‌భ కు హాజ‌రు కాబోమ‌ని వైసిపి అసెంబ్లీని బాయ్ కాట్ చేసింది. దీంతో..అప్ప‌టి నుండి శాస‌న‌స‌భ ఏక‌పక్షంగా సాగుతోంది. ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో జ‌లీల్ ఖాన్‌, చాంద్ భాషా నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. పార్టీలో చేరిన నాటి ఉత్సాహం ఇప్పుడు మంత్రులు కాకుండా మిగిలిన వారిలో ఇప్పుడు క‌నిపించ‌టం లేదు. జ‌గ‌న్ ల‌క్ష్యంగా చేసుకొని వారిని రాజ‌కీయంగా టిడిపి వినియోగించుకొంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయ‌.

టిక్కెట్లు ద‌క్కేదెవ‌రికి..వారికి మాత్ర‌మేనా..

టిక్కెట్లు ద‌క్కేదెవ‌రికి..వారికి మాత్ర‌మేనా..

ఇక‌, ఈ పిరాయింపు దార్ల‌కు టిడిపి లో చేరే స‌మయంలో అనేక హామీలు ఇచ్చారు. ప్ర‌భుత్వంలో ప్రాధాన్య‌త ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే, మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్న వారు ..ప‌ద‌వులు ద‌క్కిన వారు మిన‌హా..మిగిలిన వారు పార్టీ కార్య‌క్ర‌మాల్లో అంత చురుగ్గా పాల్గొన‌టం లేదు. ఇక‌, ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో..వీరిలో టిక్కెట్లు ఎవ‌రికి ద‌క్కుతా యనే చ‌ర్చ మొద‌లైంది. పార్టీ ఫిరాయించి వ‌చ్చిన అంద‌రికీ అవ‌కాశం ద‌క్క‌ద‌ని టిడిపి నేత‌లే చెబుతున్నారు. దీంతో ..మంత్రులుగా ఉన్న న‌లుగురిలోనూ ముగ్గురికి తిరిగి టిక్కెట్లు ఖాయంగా క‌నిపిస్తోంది. మంత్రులు ఆది నారాయ‌ణ‌రెడ్డి, అమ‌ర‌నాధ‌రెడ్డి, సుజ‌య రంగారావుల‌కు టిక్కెట్లు ఖాయ‌మ‌ని తెలుస్తోంది. అయితే, అఖిల ప్రియ కు టిక్కెట్ అంశం ఇంకా సందేహంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ సారి ఆళ్ల‌గ‌డ్డ నుండి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని బ‌రిలోకి దింపి..నంద్యా ల నుండి ఫ‌రూక్ కు అవ‌కాశం ఇవ్వాల‌నేది చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా తెలుస్తోంది. దీనికి తోడు అఖిల వ్య‌వ‌హార శైలి కార ణంగా నియోజ‌క‌వ‌ర్గంలో సుబ్బారెడ్డి ఇప్ప‌టికే వ్య‌తిరేక వ‌ర్గంగా మారారు. ఇక‌, తాజాగా టిడిపి సీనియ‌ర్ నేత రాం పుల్లా రెడ్డి పార్టీని వీడి వైసిపి లో చేర‌టానికి రంగం సిద్ద‌మైంది.

లోప‌ల అసంతృప్తి..బ‌య‌ట ప‌డ‌లేక‌..

లోప‌ల అసంతృప్తి..బ‌య‌ట ప‌డ‌లేక‌..

వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించిన వారిలో అనేక మందికి ఇప్ప‌టికే అసంతృప్తి ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మ‌ణిగాంధీ లాంటి వారు టిడిపి పై బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, మంత్రుల్లో ముగ్గురుతో పాటుగా అద్దంకి ఎమ్మెల్యే ర‌వి కుమార్‌, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి, జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అర‌కు నుండి కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు కుమారుడు, ప్ర‌స్తుత మంత్రి శ్రావ‌ణ్ కు టిక్కెట్లు ఖాయంగా కనిపి స్తున్నాయి. జ‌లీల్ ఖాన్‌, చాంద్ బాషా, సునీల్ కుమార్ వంటి వారికి ప్రాధాన్య‌త ఇచ్చే అవ‌కాశం ఉంది. మిగిలిన వారి విష‌యంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ,ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసిపి పిరాయింపు ఎమ్మెల్యేల‌కు పోటీగా స్థానికంగా టిడిపి నేత‌లు ఉన్నారు. వారు ముందు నుండి తాము పార్టీకి చేస్తున్న సేవ‌ల‌ను గుర్తించి త‌మకే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని పార్టీని కోరుతున్నారు. ఇదే స‌మయంలో వైసిపి అధినేత మాత్రం..ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడి వెళ్లిన వారి కి తిరిగి స్థానం లేద‌ని..వారు ఎన్నిక‌ల్లో సైతం గెల‌వ‌కుండా చూడాల‌నే లక్ష్యంతో ఉన్నారు. దీంతో..గెలిచిన పార్టీని వీడి..టిడిపిలో అవ‌కాశాలు వ‌స్తాయో రాకో తెలియ‌క వారిలో ఎక్కువ మంది అయోమ‌యం లో ఉన్నారు.

English summary
Dailama in YCP defected Mla's. They are in confusion on get tdp tickets in coming elections or not. some Mla's are confident on party seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X