లెక్కలన్నీ తేలుస్తా.. నేనేంటో చూపిస్తా...కేతిరెడ్డి మాస్ వార్నింగ్
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ , కూటమి కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. రిమాండ్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శిచేందుకు సోమవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ధర్మవరం సబ్ జైలుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు. దీంతో కూటమి కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కేతిరెడ్డి వాహనాన్ని కూటమి కార్యకర్తలు అడ్డుకున్నారు. ముందుకు కదలకుండా కారును చుట్టుముట్టారు. ఈ క్రమంలో కారుపైకి ఎక్కేందుకు కూటమి కార్యకర్త ప్రయత్నం చేశారు. అయితే కేతిరెడ్డి కారును వేగంగా ముందుకు నడిపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కేతిరెడ్డి ఈ ఘటనపై స్పందించారు. కేతిరెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు టైమ్ వస్తుందని, అప్పుడు తనేంటో చూపిస్తానని కేతిరెడ్డి హెచ్చరించారు. ప్రతి లెక్కాసారాన్ని సరి చేస్తా. కొత్త వాళ్లు వస్తుంటారు. పోతుంటారు. గొడవలు వద్దని తమ నాయకులు, కార్యకర్తలను కట్టడి చేశా. ప్రభుత్వ హామీలను సంవత్సరం తర్వాత ప్రశ్నిద్దామని అనుకున్నా. కానీ గొడవలను ప్రోత్సహిస్తున్నారు ధర్మవరంలో ప్రజా సమస్యలు పరిష్కరించే ఆనవాయితీ పోయింది. పీఏల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. జమిలి ఎన్నికలు జరిగితే ఏపీలోని ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. నన్ను అడ్డుకున్న వారిపై చట్టపరంగా పోరాడతామని కేతిరెడ్డి పేర్కొన్నారు.

ఇక ఈ ఇష్యూపై ఎమ్మెల్యే సత్యకుమార్ స్పందించారు. కేతిరెడ్డి తీరుపై ఎమ్మెల్యే సత్యకుమార్ మండిపడ్డారు. ఓటమితో కేతిరెడ్డిమైండ్ బ్లాక్ అయ్యి ప్రజల పైకి తన వాహనాన్ని నడిపి, గుద్దుకుంటూ వెళ్లిపోయారని మండిపడ్డారు. గతంలో చేసిన తప్పులకు కబ్జాలకు, దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి రాలేదన్నారు. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తామని చెప్పారు. ధర్మవరం ప్రజలకు చిన్న కీడు చేపట్టినా సహించమని, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని కేతిరెడ్డిని సత్యకుమార్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications