వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే వైసిపి అభ్య‌ర్దుల జాబితా..! జ‌గ‌న్ స‌మక్షంలో కీల‌క చేరిక‌లు : రేప‌టి నుండి ప్ర‌చారం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

నేడే వైసిపి లోక్‌స‌భ అభ్య‌ర్దుల జాబితా విడుద‌ల ! | Oneindia Telugu

తాజా ఎన్నిక‌ల్లో పోటీ చేసే వైసిపి అభ్య‌ర్దుల జాబితా ఈ సాయంత్రం విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది. వాస్త‌వంగా ఈ రోజు ఉద‌యం 10.26 గంట‌ల‌కు ఇడుపుల‌పాయ వేదిక‌గా జిబితా విడుద‌ల చేసి..ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించాల‌ని జ‌గ‌న్ భావించారు. అయితే వైయ‌స్ వివేకా హ‌త్య తో వాయిదా ప‌డింది. ఎన్నిక‌లకు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌టంతో ఈ రోజు సాయంత్రం లిస్టు విడుద‌ల‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

గొడ్డలితో అతికిరాతంగా హత్యచేశారు...సీబీఐతో విచారణ జరిపించాలి: జగన్గొడ్డలితో అతికిరాతంగా హత్యచేశారు...సీబీఐతో విచారణ జరిపించాలి: జగన్

వైసిపి జాబితా సిద్దం..

వైసిపి జాబితా సిద్దం..

ఏపిలోని అసెంబ్లీ..లోక్‌స‌భ స్థానాల‌కు వైసిపి నుండి పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితా సిద్దం అయింది. వాస్త‌వంగా ఈ రోజు ఉద‌యం ఈ లిస్టు విడుద‌ల కావాల్సి ఉంది. అయితే, వైయ‌స్ వివేకా హ‌త్య కార‌ణంగా వాయిదా ప‌డింది. వివేకా అంత్య క్రియ‌లు పూర్త‌యిన త‌రువాత జ‌గ‌న్ హైద‌రాబాద్ వ‌స్తారు. అక్క‌డ పార్టీ నేత‌లతో స‌మావేశం కానున్నారు. పార్టీ నేత‌ల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ క‌లిసి వివేకానంద రెడ్డి హ‌త్య పై ఫిర్యాదు చేయ‌నున్నారు. అనంత‌రం లోట‌స్‌పాండ్ లో సాయంత్రం వైసిపి అభ్య‌ర్ధుల జాబితా విడుద‌ల చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే టిడిపి..జ‌న సేన త‌మ లిస్టు ల‌ను విడుద‌ల చేసాయి. మ‌రింత ఆల‌స్యం జ‌రిగితే..క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు వ‌స్తాయ‌నే ఉద్దేశం తో జ‌గ‌న్ లిస్టును విడుద‌ల చేయాల‌ని డిసైడ్ అయ్యారని చెబుతున్నారు.

వైసిపి లోకి కీల‌క నేత‌లు..

వైసిపి లోకి కీల‌క నేత‌లు..

ఇక ఎన్నిక‌ల కురుక్షేత్రం లో దిగుతున్న వేళ‌..వైసిపి లోకి కీల‌క నేత‌లు చేరుతున్నారు. శుక్ర‌వార‌మే మాగుంట శ్రీనివా సుల రెడ్డి, కొణ‌తాల రామ‌కృష్ణ చేరాల్సి ఉన్నా..వివేకా మృతి కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ సాయంత్రం లోట‌స్ పాండ్ లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి..కొణ‌తాల రామ‌కృష్ణ తో పాటుగా వంగా గీత‌, ద్రోణం రాజు శ్రీనివాస్‌, బుట్టా రేణుక వైసిపి లో చేర‌నున్నారు. ఇప్ప‌టికే నెల్లూరు రూర‌ల్ నుండి టిడిపి అభ్య‌ర్దిగా బ‌రిలోకి దిగిన ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి సైతం వైసిపి లో చేర‌టం ఖాయ‌మైంది. ఆయ‌న ఈ రోజు లేదా రేపు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపి లో చేరనున్నారు.

రేప‌టి నుండి ఎన్నిక‌ల ప్ర‌చారం..

రేప‌టి నుండి ఎన్నిక‌ల ప్ర‌చారం..

ఈ నెల 17వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజుల వైఎస్‌ జగన్‌ ప్రచార పర్యటన ఖరారైంది. ఈ నెల 17న విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నం నుంచి జగన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు నర్సీప ట్నం, 12 గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ, సాయంత్రం 2.30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో జరిగే బహిరంగ సభల్లో జగన్‌ ప్రసంగిస్తారు. ఈ నెల 18న ఉదయం 9.30 గంటలకు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, మధ్యాహ్నం 12 గంటలకు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, 2.30 గంటలకు వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో సభలు జరుగుతాయి.

English summary
YCP contesting Candidates list will be released to day evening in Lotu pond by jagan. At the same time many leaders from other parties also joining in YCP in presence of Jagan . From sunday onwards Jagan start his election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X