వైసీపీ కార్యాలయానికి టీడీపీ ఎమ్మెల్యే - ఎం జరుగుతోంది..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రూ 4 వేల పెన్షన్ అమలు చేస్తోంది. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందచేస్తోంది. ఇదే సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ లో వెల్లడించిన ఖాళీల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను తాజా ప్రభుత్వం రద్దు చేసింది. టీచర్ల పోస్టుల భర్తీ..పథకాల అమలు పైన మాజీ మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు చేసారు.
ఎన్నికల తరువాత దాడులు పెరిగాయని మాజీ మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. విజయనగరం లో తమ పార్టీ కార్యాలయంలోకి టీడీపీ శ్రేణులు చొరవడ్డారని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదన్నారు. తమ పార్టీ కార్యాలయాలు చట్ట బద్దంగా నిర్మాణం జరుగుతున్నాయని బొత్సా వివరించారు. వైసీపీ కార్యాలయానికి అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి పరిశీలించటం ఏంటని ప్రశ్నించారు.

కార్యాలయ నిర్మాణంలో పొరపాట్లు ఉంటే నోటీసు ఇవ్వచ్చని బొత్సా వ్యాఖ్యానించారు. యూనవర్సిటీల్లో వీసీలను నియమించటం ఒక విధానమని చెప్పారు. వీసీ నచ్చకపోతే నోటీసులు ఇవ్వచ్చన్నారు. కానీ, వీసీ కార్యాలయాలకు వెళ్లి బెదిరించటం..తొలిగించటం సరికాదన్నారు. విద్యా శాఖలో అవనీతి జరిగి ఉంటే విచారణ చేసుకోవచ్చన్నారు. అధికారం వారి చేతిలో ఉందన్నారు. కొందరు రైటర్ అయిన అధికారులు అధికారంలో ఉన్న సమయంలో మాట్లాడరని..అధికారం కోల్పోతే మాట్లాడటం ఏంటని బొత్సా వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారని..పథకాలు అమలు చేస్తారో లేదా రాష్ట్ర ఆర్దిక పరిస్థితి తెలిసిన వారికి అర్దమవుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే ఖాళీలతో కలిపి ఆరు వేల వరకు టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటాయని విశ్లేషించారు. 50 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి..16 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని బొత్సా వివరించారు.












Click it and Unblock the Notifications