18 నెలల తరువాత, గుడివాడ కేంద్రంగా కొడాలి నాని కీలక ప్రకటన..!!

మాజీ మంత్రి కొడాలి నాని కీలక ప్రకటన చేసారు. 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత అనారోగ్య కారణాలతో నాని గుడివాడకు దూరంగా ఉన్నారు. గుండె ఆపరేషన్ తరువాత కోలుకున్నారు. తాజాగా జగన్ కు కలిసారు. గుడివాడలో రాజకీయ పరిస్థితుల పై చర్చించారు. జగన్ సూచనలతో వచ్చే ఎన్నికల కోసం కొడాలి నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా పార్టీ శ్రేణుల సమక్షంలో నాని ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు. తన కార్యాచరణ ప్రకటించారు.

మాజీ మంత్రి కొడాలి నాని 18 నెలల తరువాత రాజకీయంగా గుడివాడలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. గుండె ఆపరేషన్ తరువాత విశ్రాంతి తీసుకున్నారు. కేసుల వ్యవహారం కోసం ఇప్పటి వరకు వచ్చి వెళ్తూ ఉన్నారు. కాగా.. సుదీర్ఘ విరామం తర్వాత తన నియోజకవర్గంలో పార్టీ కార్యాక్రమానికి నాని హాజరయ్యారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని.. గవర్నర్‌కు అందించే వినతి పత్రంలో సంతకం చేశారు. ఆపై వినతి పత్రాలను జిల్లా కమిటీకి అందించే పార్టీ శ్రేణుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ శ్రేణులతో కొడాలి నాని ఉత్సాహంగా మాట్లాడారు.

ycp-leader-kodali-nani-announces-his-political-planning-in-gudivada

రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్య అందాలనే మంచి సంకల్పంతో మాజీ సీఎం జగన్‌ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలో ఏర్పాటుకు పునుకున్నారని కొడాలి నాని అన్నారు. వైసీపీ పాలనలో ఐదు కళాశాలలు పూర్తి చేయగా... మరో ఐదు కళాశాలల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ ప్రజలతో కలిసి పోరాటాన్ని మొదలుపెట్టారన్నారు. తాము తలపెట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చిందని చెప్పారు. ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఆరోగ్య సమస్యలతో నియోజక వర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని.. వచ్చే ఆరు నెలల కాలంలో పూర్తిగా గుడివాడ కేంద్రం గానే వైసీపీ కార్యక్రమాల్లో.. కేడర్ తో మమేకం అవుతానని ప్రకటించారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పోరాటం ప్రారంభిస్తామని నాని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+