జగన్ కు మరో సన్నిహిత నేత గుడ్ బై- చంద్రబాబు హామీ..!!
వైసీపీ ముఖ్య నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కూటమి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. మరి కొందరు వైసీపీకి గుడ్ బై చెప్పి..టీడీపీ, జనసేనలో చేరేందుకు మంత్రాంగం కొనసాగిస్తున్నారు. అందులో జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఉన్నారు. తాజాగా జగన్ సన్నిహిత నేతగా పేరున్న ప్రకాశం జిల్లా సీనియర్ నాయకుడు వైసీపీని వీడేందుకు సిద్దం అయ్యారని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే టీడీపీ నుంచి హామీ పొందినట్లు సమాచారం.
మహీధర్ రెడ్డి అడుగులెటు
ప్రకాశం జిల్లాలో జగన్ బంధువు.. వైసీపీ సీనియర్ నేత బాలినేని పార్టీ వీడారు. అయితే, ఆయన జనసేనలో చేరినా ఇప్పుడిప్పుడే ఆ పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. వైసీపీ జిల్లా కొత్త అధ్యక్షుడుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ నేత మానుగుంట మహీధర్ రెడ్డి పార్టీ వీడుతున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలోనే ఆయన పార్టీ వీడుతారని ప్రచారం సాగింది. కందుకూరు సిట్టింగ్ గా ఉన్న ఆయన్ను జగన్ పక్కన పెట్టారు. అప్పట్లోనే నెల్లూరు టీడీపీ ఎంపీగా పోటీ చేసిన వేమిరెడ్డి నేరుగా మంత్రాంగం నడిపారు. కానీ, మహీధర్ రెడ్డి వైసీపీలోనే కొనసాగాలని నిర్ణయించారు.

పార్టీకి దూరంగా
ఇక, ఇప్పుడు జిల్లాలో మారుతున్న సమీకరణాలతో మహీధర్ రెడ్డి ఆలోచన మారినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీలో మహీధర్ రెడ్డితో కలిసి పని చేసి..ఇప్పుడు టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఇద్దరు నేతలు మహీధర్ రెడ్డితో మంతనాలు చేసినట్లు సమాచారం. మహీధర్ రెడ్డి నాలుగు సార్లు కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసారు. ఆయన కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. కందుకూరు సీటును తాజా ఎన్నికల్లో జగన్ మహీధర్ రెడ్డిని కాదని .. బుర్రా మధుసూదన్ యాదవ్ కు కేటాయించారు. ఆ సమయంలో మహీధర్ రెడ్డి వర్గీయులు వ్యతిరేకించారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు విజయం సాధించారు.
ఆహ్వానాలు - బుజ్జగింపులు
ఎన్నికల సమయంలో మహీధర్ రెడ్డి అసంతృప్తితో దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవటం లేదు. కందుకూరులోని మహిదర్ రెడ్డి కార్యాలయంలో జగన్ ఫోటోను తీసివేశారు. తాజా దసరా వేళ మహీధర్ రెడ్డి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసి ఫ్లెక్సీలలో జగన్ ఫోటో కనిపించలేదు. దీంతో, మహీధర్ రెడ్డి ఇక టీడీపీలోకి వెళ్లటం ఖాయమని నియోజక వర్గంలో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే టీడీపీ ముఖ్యులు చంద్రబాబు నుంచి మహీధర్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత పైన హమీ తీసుకున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో మహీధర్ రెడ్డిని బుజ్జగించేందుకు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. దీంతో.. మహీధర్ రెడ్డి తుది నిర్ణయం ఏంటనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications