సందెట్లో సడేమియా, ఇది మంత్రి రోజా పరిస్థితి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు రెండు వారాల గడువు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు సందెట్లో సడేమియా అంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసి ఇంటింటికి తిరిగేస్తున్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకు తీరకలేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న నాయకులు మమ్మల్ని మీరే కాపాడాలి అంటూ ఓటర్లకు మనవి చేస్తున్నారు. నగిరి నియోజక వర్గంలో మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రోజా కూడా తీరికలేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే మునుపెన్నడూ కనపడని నాయకులు మాత్రమే మంత్రి రోజా వెంట తిరుగుతూ ఆమెకు ఓట్లు వెయ్యాలని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

The YCP leaders are saying that they cannot come to campaign for election in support of Minister Roja

నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాదించి జైత్రయాత్ర కొనసాగించాలని కలలు కంటున్న మంత్రి రోజాకు సొంత పార్టీ వైసీపీలోనే ఎదురుగాలి వీస్తోంది. రోజా జైత్రయాత్రకు బ్రేక్ వేస్తే తప్పా ఆమె దారిలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్న కొందరు వైసీపీ నాయకులు ఇంతవరకు ఆమె వెంటతిరగడానికి ముందుకురాలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ దెబ్బతో మంత్రి రోజాకు స్థానిక వైసీపీ నాయకుల నుంచి అడ్డంకులు ఎదురౌతున్నాయి.

ఇప్పటికే నగిరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నగిరి నియోజక వర్గంలోని పుత్తూరు, నగిరి, వడమాలపేట, విజయపురం, నిండ్రా మండలాల్లోని వైసీపీ నాయకులు రోజా వస్తున్నారని తెలిసినవెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయి ఆమె కంటకనపడకుండ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టారని తెలిసింది. నగిరి నియోజక వర్గంలోని ఐదు మండల్లాలోని వైసీపీ ముఖ్యనాయకులు రోజాకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని తెలిసింది.

The YCP leaders are saying that they cannot come to campaign for election in support of Minister Roja

మంత్రి రోజా తీరుతో విసిగిపోయిన కొందరు వైసీపీ నాయకులు ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చెయ్యలేక, ఇటు టీడీపీకి మద్దతు ప్రకటించలేక సతమతం అవుతున్నారని తెలిసింది. ఇదే సమయంలో రోజాకు దూరంగా ఉంటున్న కొందరు వైసీపీ నాయకులు పరోక్షంగా టీడీపీ వెంట తిరగాలని కార్యకర్తలకు చెబుతున్నారని తెలిసింది. మొత్తం మీద ముఖ్యనాయకులు దూరం కావడంతో ముందు నుంచి తన వెంట తిరుగుతున్న నాయకులు లేకపోయినా రోజా డీలా పడిపోయారని తెలిసింది.

ఇంత జరుగుతున్నా రోజా మాత్రం తీరికలేకుండా తిరుగుతూ ఎలాగైనా ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అయితే వైసీపీకి చెందిన కొందరు నాయకులు మాత్రం రోజా ఎలా గెలుస్తారో మేము చూస్తాం అంటూ బహిరంగంగానే చాలెంజ్ చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద నగిరిలో రోజా తీరుతో వైసీపీ నాయకులు విసిగిపోవడంతో దానిని ఓట్లుగా మలుచుకోవడానికి గాలి భానుప్రకాష్ ప్రయత్నిస్తున్నారని తెలిసింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు అనే సామెతలా రోజా పరిస్థితి ఉందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+