హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారా బ్రాహ్మణిపై ఫేక్ ప్రచారం..

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారమవుతోంది. బ్రాహ్మణి ఒక నిరుపేద మహిళ అని, అలాంటి ఆమెకు రూ.1600 కోట్లతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఫామ్ హౌస్ ను కొనబోతున్నారనేది ఆ వార్త సారాంశం. అంతటి డబ్బులు ఆమెకు ఎక్కడినుంచి వచ్చాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పలు పోస్టులు వైరల్ గా మారాయి.

పరువునష్టం దావాకు సిద్ధం

పరువునష్టం దావాకు సిద్ధం


రాజకీయ నాయకులు కొందరు ఈ విషయంలో ఫేక్ వార్తను ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. బ్రాహ్మణి విజయవంతమైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారని, ఎటువంటి వివాదాల్లో తలదూర్చరని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ వార్తను ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టందావా దాఖలు చేయబోతున్నారని ప్రకటించారు.

 తెలుగుదేశం పార్టీ ట్వీట్

తెలుగుదేశం పార్టీ ట్వీట్


దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. తనపైన, తన భార్యపైన ఎవరు ఎటువంటి ఆరోపణలు చేసినా... వెంటనే పోలీసులను పంపించి కేసులు పెట్టించే జగన్ రెడ్డీ... దివంగత ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన మహిళలపై ఫేక్ ప్రచారాన్ని చేయిస్తున్నారని, తనకు ధర్మం.. ఎదుటివారికి ఇంకో ధర్మం ఏమిటో తెలుసుకోవడానికి రంగం సిద్ధమవుతోందంటూ ఒక కొటేషన్ ను షేర్ చేసింది. దానికి ఒక ఫొటోను కూడా యాడ్ చేశారు.

వైరల్ గా మారిన ట్వీట్

వైరల్ గా మారిన ట్వీట్


టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. వైసీపీ పేటీఎం బ్యాచ్ లో కొందరు ఈ తరహా ఫేక్ వార్తలను పోస్ట్ చేస్తున్నారని, వారిపై పరువు నష్టందావా సిద్ధమవుతోందని పేర్కొంది. ప్రస్తుతం బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. సంస్థను లాభాలబాట పట్టించడంలో బ్రాహ్మణిదే కీలకపాత్ర. హెరిటేజ్ లో రిటైల్ ను విడదీసి, పాలవ్యాపారాన్ని వేరుగా ఉంచారు. కంపెనీని బిలియన్ డాలర్ల సంస్థగా తీర్చిదిద్దడమే తనముందున్న కర్తవ్యమని ఆమె గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఆ దిశగా తన వ్యాపారాన్ని నడిపిస్తున్నారు.

English summary
The gist of the news is that Brahmani is a poor woman and she is going to buy a farm house belonging to former Chief Minister of Tamil Nadu Jayalalithaa for Rs.1600 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X