హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆచూకీ ఎక్కడ?
హిందూపురం నియోజకవర్గంలో అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపధ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక నేడు ఏఎస్పీని కలిసి ఆయనకు ఈ మేరకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
అత్తాకోడళ్లపై జరిగిన దారుణ ఘటనతో అనంతపురం జిల్లా ఉలిక్కిపడింది
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అత్తాకోడళ్లపై జరిగిన దారుణ ఘటనతో అనంతపురం జిల్లా ఉలిక్కిపడిందన్నారు. మహిళలు, సామాన్య ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, నిందితులను తక్షణం అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేసేవరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

బాలకృష్ణ ఎక్కడ? దారుణ ఘటన జరిగినా స్పందించరా?
ఈ ఘటనపై జిల్లా మంత్రి సవిత సాయంత్రానికల్లా నిందితులను అరెస్ట్ చేస్తామని ప్రకటించారన్నారు. ఎస్పీ నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పి వదిలేశారని అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆచూకీ తెలియడం లేదని టార్గెట్ చేశారు. ఇంతవరకు ఈ ఘటనపైన ఆయన స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.
అన్‌స్టాపబుల్‌కి తర్వాతైనా ప్రిపేర్ కావచ్చు
ఎమ్మెల్యే బాలకృష్ణకు బాధితులను పరామర్శించే తీరిక లేదా అని నిలదీశారు. హిందూపురం ప్రజలు గెలిపించింది బాలకృష్ణనా లేదా ఆయన పీఏనా చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కూర్చుని అన్‌స్టాపబుల్‌కి తర్వాతైనా ప్రిపేర్ కావొచ్చు.. హైదరాబాద్ నుంచి హిందూపురం ఇప్పటికైనా వచ్చి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలో కానీ, పోలీసుల్లో కానీ చలనం లేదు
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలు సరిపోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పుంగనూరు ఘటనలోనూ మూడు రోజులైనా పోలీసులు స్పందించలేదన్నారు. మా నాయకులు వైఎస్ జగన్ వస్తారని తెలియగానే మంత్రులు పర్యటించారని ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు . అప్పటిదాకా ప్రభుత్వంలో కానీ, పోలీసుల్లో కానీ చలనం లేదన్నారు.
వైఎస్ జగన్ వస్తే తప్ప బాధితులకు న్యాయం చెయ్యరా?
ఈ ఘటనలోనూ వైఎస్ జగన్ వస్తే తప్ప బాధితులకు న్యాయం చేయరా..? అని ప్రశ్నించారు. అలాగే అయితే మా నాయకులు ప్రజల కోసం రావడానికి ఎప్పుడూ సిద్ధమేనని తేల్చి చెప్పారు.కూటమి ప్రభుత్వం వచ్చిన 120 రోజుల్లో మహిళలపై ఎన్నో నేరాలు చేసినా ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడింది లేదన్నారు. అత్తా కోడళ్ళపై జరిగిన దారుణ ఘటనలో కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications