రాజకీయ సన్యాసం చేస్తే ప్యాకేజీలు రావు.. పవన్ కల్యాణ్‌కు అంబటి రాంబాబు కౌంటర్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎంత గింజుకున్నా.. రాష్ట్రంలో అధికారంలోకి రాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటును చీల్చబోమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పవన్‌కు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలపై అవగాహన లేకుండా రోజుకో రకంగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. పవన్ మనసంతా చంద్రబాబు మీదే ఉందంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీతో పొత్తుకు జనసేన ఆరాటం
అసలు జనసేన పార్టీ విధానమేంటో ప్రజలకు అర్ధం కావడంలేదు. కనీసం పవన్ కల్యాణ్‌కైనా అవగాహన ఉందా ? అని అంబటి రాంబాబు చురకలు అంటించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తే టీడీపీతో పొత్తుకోసం ఆరాటపడుతున్నట్లు అర్ధమవుతోందని విమర్శించారు. బీజేపీతో గొడవ పడినట్లు తెలుస్తోందన్నారు. అందుకే టీడీపీకి వచ్చేస్తున్నా అనే సంకేతాలు ఇచ్చేందుకు మీటింగ్ పెట్టి డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

పిట్టల దొరలా పవన్ కల్యాణ్ తీరు..
జనసేన అధినేత పవర్ కల్యాణ్ నిన్నటి మీటింగ్ పిట్టల దొర వ్యవహారంలా ఉందని అంబటి సెటైర్లు వేశారు. 2024లో వైసీపీ గెలవదు, అధికారంలోకి రాదు అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. గతంలో కూడా పవన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని దుయ్యబట్టారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయ సన్యాసం చేస్తాంటూ ప్రగల్బాలు పలికారని దుయ్యబట్టారు. రాజకీయ సన్యాసం చేస్తే ప్యాకేజీలు రావన్న సంగతి జనసేన అధినేతకు అర్ధమయినట్లు ఉందని విమర్శించారు. ఇప్పుడు వైసీపీపై లేని పోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పల్లకీ తప్ప...
తాను ఎవరి పల్లకీ మోయనంటూనే చంద్రబాబు పల్లకీ తప్ప అన్న షరతును పవన్ కల్యాణ్ పెట్టుకున్నట్లుగా ఉన్నారని అంబటి విమర్శించారు. పవన్ ఓ పల్టీ నాయకుడుని దుయ్యబట్టారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆపార్టీ వ్యతిరేక ఓటును చీల్చాలన్నారు. ఇప్పుడు వైసీపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని , ఆవిషయాన్ని పవన్ మర్చిపోయారా అని నిలదీశారు. రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కే దక్కుతుందని చురకలు అంటించారు. రైతులను రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. చేశారా అని ప్రశ్నించారు. రైతుల పట్ట ప్రేమాభిమానం సీఎం జగన్‌కు మాత్రేమే ఉందన్నారు. కాబట్టే రైతలకు కాకుండా కౌలు రౌతులకు, ఆర్వోఎఫ్ఆర్ రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తున్నామని అంబటి తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications