కొత్త జిల్లాలపై వైసీపీ నేతల అసంతృప్తి.. పార్టీలో కలకలం : వాట్ నెక్ట్స్ ?..

ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటుపై రగడ కొనసాగుతూనే ఉంది. ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలే కాదు అధికార పార్టీ నేతల నుంచి కూడా చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నిర్ణయం లోపభూయిష్టంగా ఉందని మండిపడుతున్నారు. విధానపరమైన నిర్ణయాలు లేకుండా జిల్లాలను విభజించారంటూ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

 జిలాల విభజనపై ఆనం అసంతృప్తి

జిలాల విభజనపై ఆనం అసంతృప్తి


ఏపీలో జిల్లాల విభజన తీరును ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. అడ్డదిడ్డంగా విభజిస్తే వచ్చే సమస్యలను వివరించారు. నాడు అశాస్త్రీయంగా జరిగిన ఏపీ, తెలంగాణ విజభజనతో అనేక సమస్యలు వచ్చాయి. ఇప్పటి వరకు వాటికి పరిష్కారం లభించలేదు. ఇప్పుడు కూడా విధానపరమైన నిర్ణయాలు లేకుండా జిల్లాల విభజన చేస్తే అలాంటి సమస్యలే ఉత్పన్నమైయే ప్రమాదం ఉందన్నారు. కొన్ని బోర్డర్ లైన్లలో ఉన్న మండలాలు, జిల్లాల మధ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.

 వెంకటగిరికి తీవ్ర అన్యాయం

వెంకటగిరికి తీవ్ర అన్యాయం


జిల్లా విభజన చేయాల్సినప్పుడు శాస్త్రీయబద్ధంగా .. నీళ్లు, నిధులు, గ్రామాలు నుంచి విభజన జరగాలని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. వెంకటగిరి నియోజవర్గంలో ఉన్న రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిల్లా విభజనతో వెంకటగిరి నియోజ‌క‌వ‌ర్గానికి తీవ్ర‌ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డిలిమిటేషన్, రాష్ట్ర విభజన సమయాల్లో ప్రజలు నష్టపోయారని, మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా లేరని ఆనం స్పష్టం చేశారు.

 సోమశీల నీటి కోసం పోలీసులు కొట్టుకోవాలా .?

సోమశీల నీటి కోసం పోలీసులు కొట్టుకోవాలా .?


నెల్లూరు జిల్లా నుంచి రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను తొలగించడం సరికాదని ఆనం పేర్కొన్నారు. జిల్లా విభజనతో సోమశిల ప్రాజెక్టు సగం నెల్లూరు జిల్లా పరిధిలోకి మరొ సగం బాలాజీ జిల్లాకు వెళ్తుందన్నారు. అసలు సోమశీల ప్రాజెక్టును ఏం చేయాలనుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిస్థితి తీసుకువద్దామనుకుంటున్నారా అని నిలదీశారు. నాగార్జున సాగర్ డ్యామ్‌పై ఏపీ , తెలంగాణ పోలీసులు కొట్టుకున్నట్లుగా సోమశిల ప్రాజెక్టు వద్ద కూడా అలాంటి పరిస్థితి తీసుకువచ్చే ఆలోచన ఉందా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రాజ‌కీయ స్వార్థంతో కొంద‌రు..

రాజ‌కీయ స్వార్థంతో కొంద‌రు..


గతంలో కొందరు తమ రాజకీయ స్వార్థంతో రాపూరు నియోజకవర్గాన్ని తొలగించి ఈ మూడు మండలాలను కలిపి వెంకటగిరి నియోజకవర్గం చేశారు. నెల్లూరు జిల్లాలో తమ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయినా వారి ఆటలు సాగలేదన్నారు. మరొక ప్రాంతంలో పోటీ చేసినా ప్రజలు తమకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఒకరిని ఇబ్బంది పెట్టాలని ఆనాడు ప్ర‌యత్నాలు చేశారు. వారి స్వార్థానికి మూడు మండాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఇప్పుడు మరోసారి రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల ప్రజలు నష్టపోవడానికి సిద్ధంగా లేని ఆనం తేల్చిచెప్పారు. ఈమేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఆనం రామనారాయణ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+