ఎయిర్‌పోర్టు అధికారిపై దాడి కేసు: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు

చిత్తూరు: రేణిగుంట విమానాశ్రయం అధికారిపై దాడి చేసిన సంఘటనలో పోలీసులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విమానాశ్రయం అధికారిపై దాడి కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు. అరెస్టు చేసి ఆయనను ఏర్పేడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అవాంఛనీయమైన సంఘటనలేవీ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

YCP MLA Chevireddy Bhaskar Reddy arrested in attack at renigunta

నవంబర్ 26వ తేదీన వైసిపి పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి తన బంధువులకు సంబంధించినవారిని ఎయిర్‌పోర్టులో చెకింగ్ సమయం అయిపోయిన తర్వాత కూడా లోపలికి అనుమతించాలని చెప్పి అక్కడ డ్యూటీలో ఉన్న అధికారి రాజశేఖర్‌పై చెవిరెడ్డి ఒత్తిడి పెట్టారు.

అందుకు అనుమతించకపోవడంతో చెవిరెడ్డి, ఆయన అనుచరులు రాజశేఖర్‌పై దాడి చేశారు. దీనిపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ రాకపోవడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు తానుగా పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ సంఘటనలో మిథున్ రెడ్డి సహా 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+