సిక్స్ కొట్టిన ఎమ్మెల్యే రోజా! అరె, రోజా క్రికెట్ ఆడారా? ఎప్పుడు.. ఎక్కడ..

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: రాజకీయాల్లో అనుక్షణం బిజీగా గడిపే వైసీపీ ఎమ్మెల్యే రోజా కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న వైసీపీ గ్రామీణ క్రికెట్ పోటీలను శుక్రవారం ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ, వారితో కాసేపు క్రికెట్ ఆడారు. బ్యాటింగ్ చేసి అలరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారు.

YCP MLA Roja Play's Cricket, Shot Six

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హయాంలో కనీసం ఒక్క క్రీడాకారుడినైనా తయారు చేశారా? అని ప్రశ్నించారు. యువత పక్కదారి పట్టకుండా... వారిని క్రీడలవైపు మళ్లించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.

క్రీడల కోసం ఒక్క పైసా నిధులను కూడా విడుదల చేయని సీఎం చంద్రబాబు... ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పడం హాస్యాస్పదం అని రోజా వ్యాఖ్యానించారు. ఈ క్రికెట్ పోటీలకు ప్రతిరోజు ఒకరిని అతిథిగా ఆహ్వానిస్తున్నారు.

శుక్రవారం అతిథిగా ఎమ్మెల్యే రోజా విచ్చేశారు. మరో విశేషం ఏమిటంటే.. ఆమె ద్విచక్రవానంపై రావడం. అంతేకాదు, ఆ తరువాత బ్యాటు పుచ్చుకుని రంగంలోకి దిగిన రోజా క్రికెట్ ఆడి అలరిస్తూ.. ఓ సిక్స్ కూడా కొట్టేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Roja requires no introduction. She is not only an actress, anchor, judge of TV Shows, MLA but also has skills in sporting activities. YSRCP Nagari MLA has played Cricket for some time and displayed her batting skills. The Cricket event has been organized at Thummalakunta in Tirupati rural by MLA Chevireddy Bhaskar Reddy. In the event, daily one guest is invited. Today was the turn of MLA Roja who came to the event riding a two wheeler. For some time, she batted and shot six also.
Please Wait while comments are loading...