Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అవినీతి పరిపాలన అందించగల ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్ : వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు చప్పట్ల మోత

రాజకీయ నాయకులు ఏదో మాట్లాడాలి అనుకుని, ప్రజలకు ఏదో విషయాన్ని చేరవేయాలని మనసులో అనుకొని, తీరా మైకు పట్టుకున్న తర్వాత అది కాకుండా ఇంకేదో మాట్లాడతారు. నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా చెప్పబోయి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

 విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్


విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ ను అవినీతి నాయకుడు అంటూ ఆయన పేర్కొన్నారు . అవినీతి పరిపాలన అందించగలిగిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు.

అవినీతి నాయకుడు జగన్ అంటూ చేసిన వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టిన నేతలు

అవినీతి నాయకుడు జగన్ అంటూ చేసిన వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టిన నేతలు

ఆయన జగన్ ను ఉద్దేశించి అవినీతి నాయకుడు అంటూ వ్యాఖ్యలు చేయడమే విచిత్ర మైతే, ఇక ఏకంగా పక్కన ఉన్న వారంతా చప్పట్లు కొట్టి ఆయన చెప్పిన గొప్ప మాటలను మెచ్చుకున్నారు. ఇది అక్కడే ఉండి చూసిన వారు, ఎమ్మెల్యే వ్యాఖ్యలు విన్నవారు నోరెళ్ళబెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి సైతం ఇదే తరహాలో నోరు జారారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్లో మా లక్ష్యం అంటూ మీడియా ముందు తడబడ్డారు.

గతంలో ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కూడా .. అవినీతి పాలన ధ్యేయం అని వ్యాఖ్యలు

గతంలో ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కూడా .. అవినీతి పాలన ధ్యేయం అని వ్యాఖ్యలు

ఒకటే లైన్ తో మన ప్రభుత్వం ముందుకు వెళుతుందని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారని అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్లో మా ధ్యేయమని, అవినీతి పరిపాలన చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నోరు జారారు. అప్పుడు పుష్ప శ్రీవాణి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అవినీతి అరాచకాలు రాజ్యమేలుతున్నాయి అని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

టీడీపీ ఇప్పటికే జగన్ అవినీతిపై విమర్శలు .. నెటిజన్లు సెటైర్లు

టీడీపీ ఇప్పటికే జగన్ అవినీతిపై విమర్శలు .. నెటిజన్లు సెటైర్లు

సీఎం జగన్ ను అవినీతి నాయకుడిగా అభివర్ణిస్తున్నారు.నిన్నటికి నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కూడా ఫేక్ సిఎం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దానిని ఎదుర్కోవలసిన వైసిపి నాయకులే తమ నాయకుడు అవినీతి నాయకుడని, తమ పాలన అవినీతి పాలన అని మైకులు పట్టుకుని మాటలు మరీ మాట్లాడుతుండటం వైసిపి అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. నీతికి, అవినీతికి మధ్య వ్యత్యాసం తెలియకనా , లేకా నిజంగానే అవినీతి పాలన సాగిస్తున్నారా అంటూ వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+