జగన్‌కు నారాయణ షాక్: టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యే సునీల్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్‌కు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ షాకిచ్చారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సునీల్‌ను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు మంత్రి నారాయణ తీవ్రంగా శ్రమించి ఫలితం సాధించారు.
సునీల్‌ను విజయవాడలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయానికి నారాయణ వెంట తీసుకుని వచ్చారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ జాబితాలో మరో ఎమ్మెల్యే చేరారు.

నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ మంగళవారం రాత్రి తెదేపా గూటికి చేరారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆయన తెదేపా కండువా కప్పుకున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.
ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు త్వరలోనే టిడిపిలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీలోకి మరింత మంది ఎమ్మెల్యేలు వస్తారని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి చెప్పిన విషయం తెలిసిందే.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications