YCP MLC అనంత‌బాబు డ్రైవ‌ర్‌ను కొట్టే చంపారు?? అందులో నోడౌట్??

వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు మాజీ డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం మృత‌దేహంపై ఉన్న గాయాల‌న్నీ అత‌ని మ‌ర‌ణానికి 24 గంట‌ల్లోపే త‌గిలాయి.. మొద్దుబారిన వ‌స్తువుల‌తో, బ‌ల‌మైన వ‌స్తువుల‌తో అత‌న్ని జీవించి ఉండ‌గానే కొట్టారు.. శ‌రీరంపై 31 గాయాలున్నాయి.. అంత‌ర్గ‌తంగా మ‌రో మూడు గాయాలున్నాయంటూ పోస్టుమార్టం నివేదిక వ‌చ్చింది.

ఎస్పీ చెప్పిన వివ‌రాలు వేరు..!

ఎస్పీ చెప్పిన వివ‌రాలు వేరు..!

అయితే అంత‌కుముందు ఎస్పీ ర‌వీంద్ర‌నాథ్‌బాబు మీడియాకు చెప్పిన వివ‌రాలు ప‌రిశీలిస్తే.. ఎమ్మెల్సీ అనంత‌బాబు సుబ్ర‌మ‌ణ్యాన్ని బ‌లంగా వెన‌క్కి నెట్ట‌డంతో అపార్ట్ మెంట్ డ్రెయినేజీ, గ్రిల్స్ పై ప‌డి అత‌ని త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైంది. చికిత్స కోసం ఆసుప‌త్రికి తీసుకువెళుతుండ‌గా కారులోనే మృతిచెందాడు. దీంతో ఈ మ‌ర‌ణాన్ని ప్ర‌మాదంగా చిత్రించే క్ర‌మంలో అనంత‌బాబు డ్రైవ‌రు మృత‌దేహాన్ని కింద ఉంచి చెట్టు కొమ్మ‌తో చేతులు, భుజం, తొడ‌లు, వీపుపై బ‌లంగా కొట్టారంటూ ఎస్పీ వెల్ల‌డించారు.

అయితే సుబ్ర‌మ‌ణ్యం పోస్టుమార్టం నివేదిక‌ను, ఎస్పీ ర‌వీంద్ర‌నాథ్‌బాబు చెప్పిన వివ‌రాల‌కు ఎక్క‌డా పోలికే లేదంటూ తెలుగుదేశం, జ‌న‌సేన శ్రేణులు మండిప‌డుతున్నాయి. డ్రైవ‌ర్‌ను క‌చ్చితంగా కొట్టే చంపేశార‌ని, అందులో ఎటువంటి అనుమానం లేద‌ని ఆరోపిస్తున్నాయి.

నోరు, క‌ళ్లు తెరిచివున్న సుబ్ర‌మ‌ణ్యం?

నోరు, క‌ళ్లు తెరిచివున్న సుబ్ర‌మ‌ణ్యం?


సుబ్ర‌మ‌ణ్యం నోరు, క‌ళ్లు కొద్దిగా తెరిచివున్నాయి.. శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ర‌క్త‌స్రావ‌మైంది.. ఊపిరితిత్తులు కూడా కొద్దిమేర సాగాయి.. తీపిప‌దార్థాల వాస‌న వ‌స్తోంది.. భోజ‌నం చేసిన రెండు గంట‌ల త‌ర్వాత అత‌ను మ‌ర‌ణించాడంటూ రంగ‌రాయ వైద్య‌క‌ళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టెక్నాల‌జీ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ నివేదిక ఇచ్చారు.

 పాథాల‌జీ ల్యాబ్‌కు న‌మూనాలు

పాథాల‌జీ ల్యాబ్‌కు న‌మూనాలు


మృతుడి శ‌రీరంలోని అవ‌య‌వాల్లోని చిన్న చిన్న ముక్క‌లు న‌మూనాలుగా సేక‌రించి విజ‌య‌వాడ‌లోని ఆర్ఎఫ్ఎస్ఎల్‌తోపాటు రంగ‌రాయ వైద్య‌క‌ళాశాల‌లోని పాథాల‌జీ ల్యాబ్‌కు ప‌రీక్ష‌ల కోసం పంపించారు. ఈ ప‌రీక్ష‌లు కూడా పూర్త‌యితే సుబ్ర‌మ‌ణ్యం శ‌రీరం లోప‌ల ఇంకేమైనా భాగాలు దెబ్బ‌తిన్నాయా? అనే అంశంపై స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ఈ నివేదిక‌లు అధికారికంగా అందడానికి మ‌రో రెండునెల‌ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

 బ‌ల‌మైన గాయాల‌వ‌ల్లే సుబ్ర‌మ‌ణ్యం మ‌ర‌ణించాడు?

బ‌ల‌మైన గాయాల‌వ‌ల్లే సుబ్ర‌మ‌ణ్యం మ‌ర‌ణించాడు?


త‌ల‌, వీపు, కాళ్లు, చేత‌లమీద బ‌లంగా కొట్ట‌డంవ‌ల్ల త‌గిలిన గాయాల‌వ‌ల్లే సుబ్ర‌మ‌ణ్యం మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంద‌ని వైద్యులు ప్రాథ‌మికంగా ఒక అంచ‌నాకు వ‌చ్చారు. శ‌రీరంపై మొత్తం 15 గాయాలున్నాయి. ఇత‌ర గాయాల‌ను మ‌రింత లోతుగా వైద్య‌నిపుణులు ప‌రీక్షించి ఎన్ని సెంటీమీట‌ర్ల లోతు త‌గిలాయో కొల‌త‌ల‌తో స‌హా పోస్టుమార్టం నివేదిక‌లో పేర్కొన్నారు.

పోస్టుమార్టం నివేదిక స్ప‌ష్టంగా ఉండ‌టంతో ఎస్పీ చెప్పిన‌దానికి, దీనికి పొంత‌న లేకుండా పోయింద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. నిందితుణ్ని కాపాడ‌టానికి ఇలా చెప్పారని, పోస్టుమార్టం నివేదిక వ‌చ్చింది కాబ‌ట్టి ఎస్పీ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+