సంక్రాంతికి చంద్రబాబుకు సాయిరెడ్డి స్పెషల్ రిక్వెస్ట్!
సంక్రాంతి పండుగ సమీపిస్తుంది. సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీ సంఖ్యలోనే సిద్ధమవుతున్నారు. అయితే పండుగ వేళ ప్రయాణాలు చేసే వారికి బస్సులో చార్జీలతో జేబులు గుల్ల అవుతున్నాయి. సంక్రాంతి పండుగకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు అయిపోగా, ఆర్టీసీ బస్సులలోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రైవేట్ బస్సులు యజమానులు ప్రయాణికులను దోపిడీ చేయడం మొదలుపెట్టారు.
ప్రైవేట్ బస్సుల దోపిడీ.. సాయిరెడ్డి పోస్ట్
విపరీతమైన బస్సు చార్జీలతో నిలువునా దోచుకుంటున్నారు. ఇదే విషయాన్ని వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు సంక్రాంతికి ధరలను రెట్టింపు చేసి ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. ఏపీలోని ముఖ్యమైన మార్గాలలో ధరలను రెట్టింపు చేశారని ఒకేసారి మూడురెట్లు ధరలను పెంచి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ఏపీ సర్కార్ కు సాయిరెడ్డి విజ్ఞప్తి
ఈ దోపిడీ విధానం వల్ల పండుగల సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏపీ ప్రభుత్వానికి సంచలన విజ్ఞప్తి చేశారు. తక్షణమే రంగంలోకి దిగి ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న దానిపైన చర్యలు తీసుకోవాలని విజయ సాయి రెడ్డి ఏపీ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు.
ఒక్కసారిగా పెంచేసిన ఏసీ స్లీపర్ కోచ్ బస్సుల టికెట్ల ధరలు
ఇదిలా ఉంటే మామూలు రోజుల్లో 1500 రూపాయల వరకు ఉండే హైదరాబాద్ వైజాగ్ ప్రైవేట్ బస్సులో ఏసి స్లీపర్ టికెట్ ఇప్పుడు 5000 రూపాయలుగా ఉంది. మామూలు రోజుల్లో 1200 రూపాయలు వరకు ఉండే హైదరాబాద్ తిరుపతి టికెట్ ప్రస్తుతం 3000 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నాయి ప్రైవేటు బస్సులు యాజమాన్యాలు.
ప్రజల నుండి చార్జీల కట్టడికి డిమాండ్
ఇక మరికొన్ని ఏసి స్లీపర్ బస్సులు అయితే 7500 వరకు హైదరాబాద్ నుంచి విశాఖకు టికెట్ ధరలను వసూలు చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు . అయితే ప్రైవేట్ బస్సు యాజమాన్యాల చార్జీల బాదుడిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ప్రజల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది.












Click it and Unblock the Notifications