భూమా సహా 8 మందిపై వేటు వేయండి: స్పీకర్‌కు వైసిపి వినతి

హైదరాబాద్: తమ పార్టీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన 8 మంది శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పీకర్ కోడెల శివప్రసాద రావును కోరారు. ఈ మేరకు వారు శనివారంనాడు స్పీకర్‌కు వినతి పత్రం సమర్పించారు.

భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, జయరాములు, కలమట వెంకటరమణ, తదితరులు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలని వైసిపి స్పీకర్‌ను కోరింది.

 YCP seeks action against defected MLAs

ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు. పార్టీ మారిన శాసనసభ్యులపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని స్పీకరే రక్షించాలని ఆయన అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావు నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆది రాజీనామాకు అవినాష్ డిమాండ్

ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి సిగ్గు, రోషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సవాలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తే డిపాజిట్‌ దక్కదని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి జోస్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+