విశాఖ ఉక్కు ఉద్యమం.. ఎవరి వ్యూహం వారిదే .. ఏపీ బీజేపీ, పవన్ కళ్యాణ్ పార్టీని టార్గెట్ చేస్తున్న వైసీపీ
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మరో మారు ఉద్యమం మొదలైంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ప్రతిపక్ష పార్టీ ఆయన టిడిపి అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావడానికి ఆయుధంగా వాడుకుంటుండగా, అధికార పార్టీ బీజేపీ-జనసేన లను కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అంటూ టార్గెట్ చేస్తుంది.
స్పీకర్ ఫార్మాట్ లో లేని గంటా రాజీనామా లేఖ ... విశాఖ ఉక్కు కోసం హై డ్రామా.. మతలబు ఇదేనా ?

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై వైసీపీని టార్గెట్ చేస్తున్న టీడీపీ
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రకటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో దుమారం గా మారింది. ఒకపక్క టిడిపి ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని, జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే రాష్ట్ర విశాఖ ఉక్కు కర్మాగారం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు అంగీకరిస్తే కేవలం అది సీఎం జగన్ కుట్ర గా అభివర్ణిస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించడం ద్వారా లక్షల కోట్లు కొట్టేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లుగా టిడిపి విమర్శిస్తుంది.

కేంద్రంలోని బీజేపీపై ఏపీ బీజేపీ , జనసేనలు ఒత్తిడి తీసుకురావాలంటున్న వైసీపీ
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా పోరుబాట పడతామని , కార్మికుల పక్షాన పోరాటం సాగిస్తామని చెబుతూనే, రాజకీయంగా వైసీపీ ని ఇరకాటంలో పెట్టే పనిలో పడింది టిడిపి. ఇదిలా ఉంటే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ చేయడం కూడా కుట్ర అని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై రాష్ట్రంలోని బిజెపి జనసేన లు సంయుక్తంగా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. తాజాగా ఇదే విషయంపై మాట్లాడిన విశాఖ ప్రాంతానికి చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ బిజెపి ని టార్గెట్ చేశారు.

బిజెపి, జనసేన పార్టీలను ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్
ప్రజలంటే ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమేనని బిజెపి అనుకుంటుంది అని, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఉన్న బిజెపి, జనసేన నేతలు ప్రజల ఆకాంక్షను గుర్తుచేసుకొని అందుకు తగినట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బిజెపి, జనసేన పార్టీలను ఇరకాటంలో పెట్టారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖ ద్వారా ప్రజల అభిప్రాయం చెప్పినట్లు పేర్కొన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్ .

రాజకీయ పార్టీల ఫోకస్ అంతా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైనే .. ఏపీలో ఆసక్తికర చర్చ
తెలుగు ప్రజలకు నష్టం కలిగించిన, నష్టం కలిగించిన పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయని అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు కోసం రాజకీయాలకతీతంగా పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తానికి వైసీపీ ని ఇరకాటంలో పెట్టాలని టీడీపీ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణతో బీజేపీ, జనసేనలను ఇరకాటం లో పెట్టాలని వైసిపి చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.
అలాగే విశాఖ ప్రాంత రాజకీయ నాయకులకు సైతం తమ రాజకీయ భవితవ్యం కోసం విశాఖ ఉద్యమం క్రియాశీలకంగా మారింది.