Year Ender 2023: కొత్త ఏడాదిలోకి ఏపీ పార్టీల లెక్కలివే! బిగ్ ట్విస్ట్ లు తప్పవా?
ఏపీలో రాజకీయ పార్టీలకు కొత్త ఏడాది కీలకంగా మారిపోయింది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న అన్ని పార్టీలకు ఈ ఏడాది ఆరంభం అనివార్యంగా చావోరేవో పరిస్దితులను సృష్టించింది. గతంతో పోలిస్తే అధికార వైసీపీ బలహీనపడిందన్న అంచనాలు, వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు, విపక్ష టీడీపీ-జనసేన ప్రత్యామ్నాయంగా ముందుకెళ్తుండటం, వీరందరికీ ట్విస్ట్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరబోతున్న వైఎస్ షర్మిల.. ఇలా ఎటు చూసినా రాజకీయం కొత్త పుంతలు తొక్కబోతోంది.
ముందుగా అధికార వైసీపీ విషయానికొస్తే గతంలో సాధించిన 151 సీట్ల ఫీట్ ను తలదన్నేలా వై నాట్ 175 అంటూ నిన్న మొన్నటివరకూ ధీమా వ్యక్తం చేసిన జగన్ పార్టీకి ఆ పరిస్దితి లేదని తేలిపోయింది. ముఖ్యంగా దాదాపు 60 సీట్లలో ఇన్ ఛార్జ్ ల మార్పులు, ఎంపీల్ని ఎమ్మెల్యేలుగా తీసుకురావడంతో సిట్టింగ్ లు సీట్లు కోల్పోవడం వంటి పరిణామాలు ఆ పార్టీలో కొత్త ఏడాది ఆరంభంలో అశాంతిని రేకెత్తించాయి. దీంతో 11 మార్పులతో తొలి జాబితా ప్రకటించిన వైసీపీ రెండు వారాలు దాటిపోయినా రెండో జాబితా ప్రకటనకు మల్లగుల్లాలు పడుతోంది. ఇవన్నీ వెరసి వైసీపీ విజయావకాశాలపై ప్రభావం చూపేలా ఉన్నాయి.

మరోవైపు వైసీపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలు కొత్త ఏడాదిలో కీలకంగా మారాయి. గతంతో పోలిస్తే చంద్రబాబు అరెస్టు తర్వాత రగిలిపోతున్న టీడీపీ-జనసేన పార్టీలు కొత్త ఏడాదిలో ప్రదర్శిస్తున్న దూకుడుతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల చూపు ప్రస్తుతం ఈ ద్వయంపై పడింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న, మరోసారి అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో ఉన్న బీజేపీవైపే వీరిద్దరి మొగ్గు కనిపించేలా ఉంది. క్షేత్రస్ధాయిలో పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న ఈ రెండు పార్టీలకు బీజేపీ కూడా తోడయితే 2014 ఫలితాలను రిపీట్ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
టీడీపీ-జనసేన ప్రస్తుతం రాష్ట్రంలో కూటమిగా ముందుకెళ్తున్నాయి. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ కూడా వీరితో కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ-జనసేన కూటమి గెలిస్తే సీఎంగా చంద్రబాబే ఉంటారన్న లోకేష్ వ్యాఖ్యలు ఇప్పుడు జనసేనలో కలకలం రేపాయి. దీంతో ఈ కీలక అంశంపై క్లారిటీ ఇస్తే తప్ప జనసేన ఓటు టీడీపీకి బదిలీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అదే సమయంలో గతంలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తాజాగా చంద్రబాబుతో వచ్చి చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే కొత్త ఏడాదిలో కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్సార్టీపీ అధినేత్రిగా ఉన్న వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తే ఏపీ రాజకీయంలో ప్రకంపనలు ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ పోరు మొదలవుతుంది కాబట్టి. వీరిద్దరి పోరులో గతంలో కాంగ్రెస్ నుంచి జగన్ లాక్కున్న ఓటు బ్యాంకు ఎలా స్పందిస్తుందన్నది వైసీపీ భవిష్యత్తును డిసైడ్ చేయబోతోంది. దీంతో వైఎస్ షర్మిలను సాధ్యమైనంత త్వరగా పార్టీలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే తాను కోరుకున్నట్లు పనిచేసే స్వేచ్ఛ ఉంటేనే వచ్చేందుకు ఆమె మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా షర్మిలను కాంగ్రెస్ లోకి వెళ్లకుండా జగన్ దూతల్ని పంపి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications