కరోనాకి తీసిపోని ఎల్లో వైరస్ ..సిగ్గు శరం లేదు.. శవ రాజకీయం చేస్తున్నారు.. : కొడాలి నానీ ఫైర్

ఏపీలో కరోనా వైరస్ ప్రబలుతున్నా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగటం లేదు .చోడవరంలో వృద్ధురాలి మృతిపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. కరోనా వైరస్‌కు భయపడి చంద్రబాబు ఇంట్లో దాక్కున్నారని ఆయన మండిపడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తప్పుడు రాజకీయాలు చెయ్యటానికి, తప్పుడు రాతలు రాయటానికి ఇది సందర్భం కాదని కొడాలి నానీ విమర్శించారు.

Recommended Video

    Kodali Nani Slams Chandrababu Naidu And Yellow Media

     ఎల్లో వైరస్ ను భూస్థాపితం చేసే వ్యాక్సిన్ జగన్

    ఎల్లో వైరస్ ను భూస్థాపితం చేసే వ్యాక్సిన్ జగన్

    రాష్ట్రంలో రేషన్‌ సరఫరాపై మాట్లాడిన ఆయన కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే శవ రాజకీయాలు చెయ్యటానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు రేషన్ అందించటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని పేర్కొన్నారు. చంద్రబాబు ఎల్లో వైరస్ అని కరోనాకు తీసిపోరని అయితే దాన్ని భూస్థాపితం చేసిన వ్యాక్సిన్ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఇక చంద్రబాబును ఇష్టారాజ్యంగా తిట్టిపోశారు. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు సిగ్గూ శరం లేని కుక్కలని , ప్రభుత్వం ఒకపక్క విపత్తును ఎదుర్కోటానికి కష్టపడుతుంటే అనవసరపు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

    చంద్రబాబుకు 70 ఏళ్ళ వయసు వచ్చినా సిగ్గు శరం లేదని వ్యాఖ్యలు

    చంద్రబాబుకు 70 ఏళ్ళ వయసు వచ్చినా సిగ్గు శరం లేదని వ్యాఖ్యలు

    చంద్రబాబుకు 70 ఏళ్ళ వయసు వచ్చినా సిగ్గు శరం లేదని, బుద్ధి జ్ఞానం లేదని శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే విధంగా ప్రతిపక్షం ఉండాలని అన్నారు. ఇక చంద్రబాబుకు అనుకూలంగా తప్పుడు వార్తలు రాస్తున్నా ఎల్లో వైరస్ కోరలు పీకే మందు తమ దగ్గర ఉందన్నారు. రేషన్‌ డీలర్ దగ్గర ఎండలో నిలబడి వృద్ధురాలు చనిపోయిందంటూ జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక దానికి బాధ్యులుగా మేము రాజీనామా చెయ్యాలని రాజకీయం చెయ్యటం దారుణం అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదని చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లిపోయారని విమర్శించారు. కరోనాకు భయపడి హైదరాబాద్ లో దాక్కున్నారని విమర్శించారు.

    ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ అందిస్తున్నాం

    ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ అందిస్తున్నాం

    ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. అందరికీ రేషన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రేషన్ డిపోల వద్ద జనం గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేషన్‌ డిపోల వద్ద సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు. వలంటీర్ల నియామకాన్ని టీడీపీ నేతలు విమర్శించారని గుర్తు చేసిన కొడాలి నానీ ఇప్పుడు ఆ వ్యవస్థను గుర్తించడం సంతోషకరమన్నారు. కరోనా నియంత్రణపై వలంటీర్లు సైనికుల్లా పనిచేస్తున్నారని అభినందించారు. వలంటీర్లు ప్రతి ఇంటికివెళ్లి వాళ్ల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. అంతే కాదు ప్రజలకు కావలసిన నిత్యావసరాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+