ఊపిరితీసిన ప్రేమ : యువతి కోసం ఆందోళన, మరునాడే మృతి
ఒంగోలు : ప్రేమించనని చెప్పాడు ... యువతి ఇంటి ముందు ఆందోళన చేపట్టాడు. తెల్లవారే విగతజీవిగా మారడంతో .. అతనిది హత్య .. లేదా ఆత్మహత్య అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒంగోలులో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
ప్రేమ కోసం ..
గోపాల్ నగర్ కు చెందిన అవినాష్ రెడ్డి .. ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను అంగీకరించడం లేదని భావించాడో ఏమో కానీ .. నిన్న ఆ యువతి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టాడు. దీంతో యుువతి పేరెంట్స్, పెద్దలు నచ్చజెప్పడంతో వెళ్లిపోయాడు. అయితే మరునాడే చనిపోవడం పలు అనుమానాలకు దారితీసింది. అవినాష్ రెడ్డి తానే ఆత్మహత్య చేసుకున్నాడా ? లేదంటే యువతి బంధువుల చంపించారా అనే డౌట్స్ వస్తున్నాయి.

విగతజీవిగా ..
శనివారం యువతి ఇంటి వద్ద ఆందోళన చేసిన అవినాష్ .. ఇవాళ తిరుపతమ్మ గుడి వద్ద విగతజీవిగా మారాడు. అయితే తమ కుమారుడు చనిపోయేంత పిరికివాడు కాదని అతని తల్లిదండ్రులు చెప్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులే చంపి ఉంటారని ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు అవినాష్ మృతి మిస్టరీ తేల్చేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. నిన్నటి నుంచి ఏం జరిగింది ... యువతి ఇంటి నుంచి అవినాష్ ఎక్కడికివెళ్లాడు ? ఏం చేశాడు ? ఎవరెవరిని కలిశాడు అనే అంశాలపై లోతుగా విచారిస్తున్నారు. ఆయా అంశాలపై స్థానికలు చెప్పే సమాధానాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు.
సస్పెక్ట్ డెత్ కేసుగా ...
అవినాష్ రెడ్డి మృతి కేసును పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి .. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతని స్నేహితులు .. అమ్మాయి సన్నిహితులను కూడా విచారిస్తామని చెప్తున్నారు. మొత్తానికి అవినాస్ ఆత్మహత్య లేదా హత్య అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే ప్రేమించిన యువతి దక్కలేదని అవినాష్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పలువురు సందేహాం వెలిబుచ్చుతున్నారు. అయితే పోలీసు విచారణలో నిజనిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications