మొన్న విజయవాడ ఉత్సవ్.. నిన్న విజయనగరం ఉత్సవ్.. ఉత్సవాలతో ఊపేస్తున్న ఏపీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉత్సవాల శోభ కనిపిస్తోంది. మొన్నటికి మొన్న విజయవాడ ఉత్సవ్ పేరుతో దసరా పండుగ సందర్భంగా హంగామా చేసిన ఏపీ ప్రభుత్వం, విజయవాడ ఉత్సవ్ లో నిర్వహించిన దసరా కార్నివాల్ లో నిర్వహించిన భారీ డప్పు ర్యాలీ గిన్నిస్ బుక్ రికార్డును సాధించింది. విజయవాడ ఉత్సవ్ లో వైబ్రెంట్ ఫర్ సొసైటీ ప్రతినిధులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును అందుకున్నారు.
కొనసాగుతున్న విజయనగరం ఉత్సవ్
గిన్నిస్ బుక్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్నివాల్ లో భారీ డప్పు ర్యాలీ ఇప్పటివరకు ప్రపంచంలోనే ఎవరు నిర్వహించని కారణంగా డప్పు ర్యాలీకి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కింది. ఇక తాజాగా విజయనగర చారిత్రక వైభవాన్ని చాటేలా విజయనగరం ఉత్సవ్ నిర్వహించింది. విజయనగరంలో నిర్వహించిన విజయనగరం ఉత్సవ్ లో ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

విజయనగరం ఔన్నత్యాన్ని తెలిపేలా ఉత్సవాలు
నిన్న రాత్రి విజయనగరం పైడితల్లి ఆలయం వద్ద మంత్రులు వంగలపూడి అనిత కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయనగరం ఉత్సవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన లేజర్ షోను తిలకించారు. ఆపై మాట్లాడిన ఆయన విజయనగరం ఔన్నత్యాన్ని, గత చారిత్రక వైభవాన్ని విజయనగరం ఉత్సవ్ చాటుతుంది అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రత్యేకతలు చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
ఆధ్యాత్మిక చింతనకు, కళలకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం విజయనగరం అని ఆయన ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా విజయనగరం ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం పైడిమాంబ తల్లి దేవాలయం, సిరిమాను ఉత్సవాలు, రామతీర్థం, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బొబ్బిలి వీణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో విలసిల్లిన నగరం విజయనగరం అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంత మహనీయులను స్మరించుకున్న మంత్రి
మహాకవి గురజాడ అప్పారావు, వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు, మల్లయుద్ధ ప్రవీణుడు కోడి రామమూర్తి తదితరులను ఆయన గుర్తు చేశారు. అద్భుత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాటల ఓనమాలు నేర్చుకున్న ప్రాంతం ఇది అన్నారు. మధురగాయని సుశీలమ్మ గొంతెత్తి పాడిన ప్రాంతం కూడా ఇదేనని గుర్తు చేశారు. ఈ ఉత్సవ్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అదితి గజపతిరాజు తదితరులకు ఆయన అభినందనలు తెలిపారు.
గత ప్రభుత్వంలో కళలకు ప్రోత్సాహం లేదన్న మంత్రి
గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఎటువంటి ఉత్సవాలను చూడలేదని, రాష్ట్రంలో కళలు విహీనంగా మారాయని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో సాంస్కృతిక రంగానికి, కళలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నది అన్నారు. కళలను పోషిద్దాం.. రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకు వెళదామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
-
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్











Click it and Unblock the Notifications