ప్రేయసిపై అనుమానంతో పెళ్లి రద్దు ; ఆపై పెట్రోల్ పోసి, నిప్పంటించిన యువకుడి దారుణం !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతులపై దారుణాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుపై ప్రేమోన్మాది రమ్యను కత్తితో పొడిచి హతమార్చిన ఘటన మరిచిపోకముందే తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. దేశంలో నిర్భయ వంటి చట్టాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ చట్టం ఉన్నప్పటికీ మృగాళ్ల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు.

 ఏపీలో మరో దారుణ ఘటన .. మహిళల రక్షణ పెద్ద ప్రశ్న

ఏపీలో మరో దారుణ ఘటన .. మహిళల రక్షణ పెద్ద ప్రశ్న

నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు, ప్రేమ నిరాకరించారని అమానుషంగా హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ప్రేయసిపై పెట్రోల్ పోసి ఓ యువకుడు అమానుషంగా నిప్పంటించిన ఘటన విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గ పూసపాటిరేగ మండలం చౌడువాడలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా ప్రజలను షాక్ కు గురి చేసింది. రమ్య హత్య కేసు రాష్ట్రంలో సృష్టించిన భయాందోళన నుండి బయటపడక ముందే తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన మరోమారు మహిళల రక్షణను ప్రశ్నిస్తుంది.

విజయనగరం జిల్లాలో పెళ్ళికి రెడీ అయిన ప్రేమ జంట .. సడన్ గా పెళ్లి క్యాన్సిల్

విజయనగరం జిల్లాలో పెళ్ళికి రెడీ అయిన ప్రేమ జంట .. సడన్ గా పెళ్లి క్యాన్సిల్

ఈ ఘటన వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నార్వేకు చెందిన డ్రైవర్ ఆళ్ల రాంబాబు అనే యువకుడు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడ కు చెందిన గాలి రాములమ్మ అనే యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. అయితే గత కొన్నాళ్లుగా మొబైల్లో రాములమ్మ ఎక్కువగా మాట్లాదుతున్నట్టు గుర్తించిన్ రాంబాబు రాములమ్మపై అనుమానం పెంచుకున్నాడు . వేరే యువకుడితో మాట్లాడుతోంది అంటూ రాములమ్మతో పెళ్లిని రద్దు చేసుకున్నాడు.

ప్రేయసిపై అనుమానం .. పెళ్లి ఇష్టం లేక పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

ప్రేయసిపై అనుమానం .. పెళ్లి ఇష్టం లేక పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి రెండు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చారు. పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు రాంబాబు సైతం అంగీకరించాడు. కానీ రాములమ్మను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని రాంబాబు ఆమెపై పెట్రోల్ పోసి నిన్న అర్ధరాత్రి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడు కూడా మంటలు అంటుకోవడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. సోదరిపై దాడి చేస్తున్న రాంబాబును అడ్డుకునే క్రమంలో రాములమ్మ అక్క సుందరమ్మ కు ఆమె కుమారుడు అరవింద్ కు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రేయసితో పాటు మరో ఇద్దరికీ గాయాలు .. కేసు నమోదు

ప్రేయసితో పాటు మరో ఇద్దరికీ గాయాలు .. కేసు నమోదు


ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని హుటాహుటిన విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 60 శాతం గాయాలతో రాములమ్మ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. రాములమ్మ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన రాంబాబు అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం రాంబాబును అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. ప్రేమించిన అమ్మాయి వేరే యువకుడితో సంబంధం కొనసాగిస్తున్నదన్న అనుమానంతో రాంబాబు చేసిన ఘాతుకం ఇప్పుడు విజయనగరం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో మహిళల రక్షణపై అధికార పార్టీని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు

ఏపీలో మహిళల రక్షణపై అధికార పార్టీని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు

ఇదిలా ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా యువతులపై జరుగుతున్న దారుణ ఘటనలపై ఏపీలో ఆందోళనల పర్వం కొనసాగుతుంది. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు, మహిళా సంఘాలు మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి ఘటనలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+